Trinayani Today Episode: తిలోత్తమ చీరమీద కిరోసిన్ పడిందని నయని చెప్తుంది. దీంతో హాసిని అయితే ముందు మీకే హారతి ఇస్తాను అత్తయ్య అంటూ తిలోత్తమ దగ్గరకు వెళ్తుంది. దీంతో తిలోత్తమ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంది. అందరూ హాసినిని అడ్డుకునేందుకు పరుగులు తీస్తారు. చివరకు హారతి ఆరిపోవడంతో హాసిని ఆగిపోతుంది.


తిలోత్తమ: ఏయ్ బుద్ధుందా నీకు చంపేస్తావా ఏంటి నన్ను..
హాసిని: హారతి తీసుకుంటే చనిపోతారా అత్తయ్య.
విశాల్: అసలు నీ చీర మీద కిరోసిన్ ఎలా పడింది అమ్మ.
నయని: పై నుంచే పడాలి అక్కడ ఏం పెట్టారు.
సుమన: ఇంట్లో కిరోసిన్ ఎవరు పెట్టారు అసలు..
ఎద్దులయ్య: గాయత్రీ అమ్మా.. అవును బాబు.. లాంతరులో ఉన్నదే కదా మీరు అంటున్న ఆ కిరోసిన్.. మరి ఆ లాంతరు ఇంటికి రప్పించింది ఆ తల్లి కాక ఇంకెవరు అయింటారు మాతా..
వల్లభ: మమ్మీ ఈ రోజు గ్రహచారం అస్సలు బాలేదు నువ్వు పద మమ్మీ వేరు చీర మార్చుకో.. హాసిని ఇచ్చిన హారతికి నీ దాహం ఇంకా తీరినట్లు లేదు కదా మమ్మీ.
తిలోత్తమ: ఏంటోరా ఇంకా కొంచెం ఉండుంటే.. గాయత్రీ అక్కయ్య చితి పేర్చిన చోటే నేను కూడా బూడిద అయ్యుండేదాన్ని.


ఇంతలో హాసిని వచ్చి తిలోత్తమ, వల్లభలు గాయత్రీ దేవి ఫొటోకు కొట్టిన స్ఫ్రే వీడియోని చూపిస్తుంది. 
తిలోత్తమ: ఎవరు తీశారు ఈ వీడియో.
హాసిని: నేను కాకుండా ఇంకెవరైనా తీసినా ఈ పాటికి కొదమ సింహంలా విరుచుకుపడేది చెల్లి. 
వల్లభ: ఇంతకీ ఈ విషయం తెలుసా..
హాసిని: తెలీదు తెలీకూడదు అనే నేనే చిట్టీ కంటే ముందు వచ్చి హారతి పళ్లెం పట్టుకొని హల్ చల్ చేశారు. మీ మీద కిరోసిన్ ఎలా పడిందో తెలుసా.. గాయత్రీ అత్తయ్య ఏంటి అలా షాక్ అవుతున్నారు..
వల్లభ: పెద్దమ్మ వచ్చిందా..
హాసిని: ఎప్పుడో వచ్చింది..
తిలోత్తమ: జోకులు వేయకు.
హాసిని: కిరోసిన్ అయితే వేసిందా లేదా.. 
తిలోత్తమ: వీడియో తీసి ఇది ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే.. నువ్వు నమ్మి భయపడతావా.. 
హాసిని: ఇంకో విషయం మాఘమాసం వచ్చింది పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యాను.
వల్లభ: ఎవరికి.. 
హాసిని: మీ అమ్మకి.. పెళ్లి మామూలుగా ఉండదు..


తిలోత్తమ: గురువుగారు  ఇంటికి వస్తున్నారు అని రాత్రే చెప్పారు కదా..
పావనా: ఎందుకు వస్తున్నారు.
డమ్మక్క: ఈరోజు మహా పౌషి కదా.
విక్రాంత్: పౌషి అంటే..
విశాల్: పుష్యమాసంలో వచ్చే మొదటి పౌర్ణమిని పౌషి అంటారు. నయని లక్ష్మదేవికి, శనీశ్వరుడికి పూజ చేసి గురువుగారికి కొత్త బట్టలు ఇవ్వాలని తీసుకొస్తుంది. 
ధురందర: సుమన కూడా లేదు.
హాసిని: అన్నా చెల్లెల్లు చేయాల్సిన పూజ పిన్ని ఇది. అన్న లేడు కదా అందుకే అక్కా చెల్లెల్లు చేస్తున్నారు. అక్కాచెల్లెలు కూడా చేయొచ్చు పిన్ని. 
విశాల్: గురువుగారు రావడంతో.. గురువుగారు కూర్చోండి మా అమ్మ మీకు వస్త్రధానం చేస్తుంది.
తిలోత్తమ: నేనా..
హాసిని: అమ్మా అనగానే బొమ్మలా ముందుకు వచ్చేస్తారు అత్తయ్య మీరు. విశాల్ అన్నది తనను కన్న తల్లి గాయత్రీ అత్తయ్య గారిని. 
వల్లభ: పెద్దమ్మ దానం చేస్తుందా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంది.
పావనా: గాయత్రీ పాపని చూసి.. ఏదైనా ట్విస్ట్ ఉంటే ముందే చెప్పండి సడెన్‌గా షాక్ ఇస్తే గుండె ఆగేలా ఉంది.
డమ్మక్క: రాత్రి భోజనం చేశాక ఇష్టాగోష్టి జరిగింది అప్పుడు తెల్లారాక పూర్ణిమ గడియల్లో గురువుగారికి గాయత్రీ దేవిగారే వస్త్ర ధానం చేస్తే బాగుంటుందని నిర్ణయించారు. 
విక్రాంత్: పెద్దమ్మ ఫొటోని నయని వదిన చేతుల్లో పట్టుకొని గురువుగారికి దానం చేస్తారు. 
నయని: గత జన్మలో అమ్మగారు పుష్యపూర్ణిమ రోజు స్వామి వారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు అమ్మగారి తండ్రి అయిన పుండరీనాథం ఫొటోలు పట్టుకొని ధానం ఇచ్చేవారు అట. ఇప్పుడు అలా చేస్తే సరి. 
సుమన: ఏంటి సరి ఇప్పుడు అలా చేస్తే గాయత్రీ అత్తయ్య చచ్చినట్టే కదా..
విక్రాంత్: షట్ అప్.
సుమన: అయ్యో నన్ను అపార్థం చేసుకోకండి.. నా అంతరంగం కూడా మీకు అర్థమవ్వాలి. వాళ్ల నాన్న గారు పోయాక ఫొటో పట్టుకొని పెద్దత్తయ్య దానధర్మాలు చేశారు అని మీరే అన్నారు. పుండరీనాథం తాతగారు అయితే పునర్జన్మ ఎత్తలేదు కదా అంటే పైకి పోయిన ఆయన ఫొటో పట్టి దానధర్మాలు చేశారు అని గుర్తు చేస్తున్నా తప్పుగా అనుకోకండి. 
గురువుగారు: పర్వాలేదు సుమన విసదీకరించినందుకు ధన్యవాదాలు. విశాలా సుమన అన్నట్లు పటాన్ని పట్టుకొని నాకు వస్త్ర ధానం చేయడం ఎందుకు నీ భార్యని నీ అమ్మని ఎత్తుకొని వచ్చి నాకు వస్త్రార్పణం చేయమను.
నయని: అమ్మగారు ఎక్కడ ఉన్నారు స్వామి.
గురువుగారు: ఇక్కడే ఉన్నారు కదా నయని.
ధరుందర: గాయత్రీ వదిన ఎక్కడుందని నయనిని ఎత్తుకోమంటున్నారు.
డమ్మక్క: బొమ్మలతో ఆడుకుంటుంది కదా ధురందర. గాయత్రీ పేరు తనకి ఉంది కాబట్టి గురువుగారికి ధానం చేయడానికి ఈ పసి పాపను ఉపయోగిస్తే పరిష్కారం అవుతుంది కదా.. 


నయని గాయత్రీ పాపని ఎత్తుకొని గురువుగారికి ధానం ఇస్తుంది. ఇక విక్రాంత్ సుమనకు కూడా ధానం ఇవ్వమని చెప్తాడు. అయితే సుమన మనసు మార్చుకున్నానని ఇప్పుడు ఇవ్వనని అంటుంది. గాయత్రీ పాప నెత్తిమీద కుమ్మరిస్తాను అని ఉప్పు, జమ్మిఆకు, నల్లనువ్వులను గాయత్రీ పాప తల మీద వేసేస్తుంది. దీంతో కోపంతో నయని ఏయ్ సుమన శనీశ్వరుడికి సమర్పించాల్సినవి పసిపాప తలమీద పోస్తావా.. దీంతో సుమన దరిద్రపు బతుకు బతికిన ఈ పిల్లని లక్ష్మీదేవిని చేశాక ఇంకేంటి ప్రాబ్లమ్ అని అడుగుతుంది. దీంతో నయని సుమన చెంప పగలగొడుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ జనవరి 22nd: రుద్ర, రేణుకలపై విరుచుకుపడ్డ భైరవి.. రెండో పెళ్లి చేస్తానని వార్నింగ్!