ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను ప్రేక్షకులు అంతగా అభిమానించడానికి కారణం వ్యక్తిగత జీవితంలో ఆయన నడుచుకునే విధానం కూడా! అనుబంధాలకు, ఆత్మీయులకు ఆయన ఎంతో విలువ ఇస్తారు. గీతా ఆర్ట్స్ సంస్థలో, తన దగ్గర చిరకాలంగా సేవలు అందిస్తున్న ప్రముఖ యువ నిర్మాత ఎస్.కె.ఎన్ ఇంటికి అల్లు అర్జున్ ఆదివారం వెళ్లారు.
ఎస్.కె.ఎన్ తండ్రికి అల్లు అర్జున్ నివాళి
నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి గాదె సూర్య ప్రకాశ రావు ఈ నెల (జనవరి) 4వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆ విషయం తెలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా కొణిదెల, అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
తండ్రి మరణించిన దుఃఖంలో, బాధలో ఉన్న ఎస్.కె.ఎన్ కుటుంబ సభ్యులను ఈ రోజు అల్లు అర్జున్ పరామర్శించారు. హైదరాబాద్ సిటీలోని ఎస్.కె.ఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ఓదార్పునిచ్చారు. గాదె సూర్య ప్రకాశ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
Also Read: అయోధ్య శ్రీరామ రూపం, ధరణి దర్శన పుణ్య తీర్థం - వైరల్ సాంగ్ విన్నారా?
అల్లు అర్జున్ ప్రతిభ, సినిమాలపై ఆయనకు ఉన్న ప్రేమ, క్యారెక్టర్స్ కోసం ఆయన కష్టపడే తీరు, చూపించే అంకితభావానికి ఎస్.కె.ఎన్ ఆరాధకుడు. బన్నీని ఆయన చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అటువంటి బన్నీ ఇంటికి రావడం ఎస్.కె.ఎన్ (SKN)కి ఎంతో ఓదార్పునిచ్చింది. ''కష్ట కాలంలో మా ఇంటికి వచ్చినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి చాలా చాలా థాంక్స్. మా నాన్నగారి మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు. మాకు ఎంతో ధైర్యం చెప్పారు'' అని అన్నారు.
Also Read: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ చూశారా?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా... హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన 'టాక్సీవాలా' చిత్రాన్ని ఎస్.కె.ఎన్ ప్రొడ్యూస్ చేశారు. జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల 'బేబీ' సినిమాను ఎస్.కె.ఎన్ ప్రొడ్యూస్ చేశారు. యువతను ఆకట్టుకునే ట్రెండీ కథలతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారని ఆయన పేరు తెచ్చుకున్నారు.
Also Read: లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ రిలీజ్ - క్లీనింగ్ వ్యసనంగా మారితే ఇలాగే ఉంటుందేమో!