జై శ్రీరామ్... జై శ్రీరామ్... జై శ్రీరామ్... సోమవారం ఎటు చూసినా శ్రీరాముని నామ స్మరణ వినిపించింది. ప్రజల్లో రామునిపై భక్తి భావం కనిపించింది. శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరంలో సోమవారం బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 'అయోధ్య శ్రీ రామ్' పేరుతో తెలుగు, హిందీ భాషల్లో ప్రవాస ఆంధ్రుని నిర్మాణ సారధ్యంలో రూపొందించిన గీతం వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 


సత్య కశ్యప్ సంగీతంలో...
సమీర్ పెనకలపాటి నిర్మాణంలో!
యువ సంగీత దర్శకుడు సత్య కశ్యప్ 'అయోధ్య శ్రీరామ్' గీతానికి మంచి బాణీ అందించారు. ఆయన డివోషనల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్ 2'తో పాటు కమల్ కామరాజు హీరోగా నటించిన 'లా', ఇంకా 'ఐరావతం' తదితర సినిమాలకు సంగీతం అందించారు. 


ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రవాస భారతీయుడు, తెలుగు వ్యక్తి సమీర్ పెనకలపాటి 'అయోధ్య శ్రీరామ్' గీతాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ భక్తి పాటతో ఆయన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు.


ప్రవాస భారతీయులు, ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ అధినేత సమీర్ పెనకలపాటి ఈ 'అయోధ్య శ్రీరామ్' గీతం గురించి మాట్లాడుతూ... "శ్రీ రాముని స్తుతిస్తూ ఒక గీతం రూపొందించే అవకాశం మాకు లభించడం చాలా అదృష్టంగా  భావిస్తున్నాను. ఇది మాకు లభించిన ఆ శ్రీరాముని కృప. ఈ ఆల్బమ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆ అవతార పురుషుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామ గీతంతో మా ఎస్.పి. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈ గీతాన్ని ఆంజనేయ - లక్ష్మణ సమేత సీతారాముల పాదపద్మాలకు భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నా" అని అన్నారు.


Also Readనాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!



సంగీత దర్శకుడు సత్య కశ్యప్ మాట్లాడుతూ ''ఆది పురుషుడు రామయ్యపై ఎంతో అవ్యాజ్యమైన భక్తితో 'అయోధ్య శ్రీరామ్' పేరుతో ప్రత్యేక ఆల్బమ్ రూపొందించాం. ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిన వేళ... ఆ అయోధ్యలో ఆయన మందిరం ప్రారంభమైన రోజు... చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన తరుణంలో పాట విడుదల కావడం మరింత ఆనందంగా ఉంది'' అని చెప్పారు.


Also Readఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగన లుక్ చూశారా?



యూట్యూబ్‌లో 24 గంటల్లో 50 వేల వ్యూస్!
'అయోధ్య శ్రీరామ్' పాటకు తెలుగులో చిరంజీవి ఎన్ని సాహిత్యం అందించారు. ఈ బాణీ రూపకర్త సత్య కశ్యప్ స్వయంగా ఆలపించారు. ప్రముఖ గాయని చిన్మయి, స్నికిత, స్రగవి కోరస్ అందించారు. హిందీ గీతానికి తన్వీర్ ఘాజి సాహిత్యం అందించగా... ఆకాంక్ష సైనీతో కలిసి సత్య కశ్యప్ పాడారు. ఈ పాటకు యువర్స్ ఉన్ని ఎడిటర్. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే మరిన్ని వ్యూస్ వచ్చేలా ఉన్నాయి.


Also Readదర్శకుడిగా ధనరాజ్ మొదటి సినిమా ఫస్ట్ లుక్ - ఆయన వెనుక ఉన్న నటుడిని గుర్తు పట్టారా?