Kangana Ranaut first look as Indira Gandhi from Emergency, movie release date: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. కేవలం నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహించారు, మణికర్ణిక ఫిలిమ్స్ పతాకంపై ప్రొడ్యూస్ కూడా చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్
'ఎమర్జెన్సీ' సినిమాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. షార్ట్ హెయిర్ కట్, మెడలో రుద్రాక్ష మాల, శారీ... ఇందిరగా కంగనాను చూస్తే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేలా ఉన్నారు. అయితే... ఈ లుక్ అంత ఈజీగా రాలేదు. దీనికి కోసం ముందు నుంచి వర్క్ చేశారు. ప్రోస్థటిక్ మేకప్ ఉపయోగించారు.
ఇండియాలో చీకటి ఘడియల వెనుక కథ
జూన్ 14, 2024న 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు కంగనా రనౌత్ వెల్లడించారు. ''ఇండియాలో చీకటి ఘడియల వెనుక ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలోనే అత్యంత భయపడిన, భయంకరమైన ప్రధాన మంత్రిని సినిమా హాళ్లల్లో చూడండి'' అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి కోణంగా కొందరు చెబుతుంటారు. వాళ్లపై ఎదురు దాడి చేసే వారు కూడా ఉన్నారు. అయితే... బీజేపీ మనిషిగా ముద్ర పడిన కంగనా రనౌత్ నుంచి 'ఎమర్జెన్సీ' వస్తుండటంతో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
'ఎమర్జెన్సీ' సినిమాలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తోంది.
Also Read: నయా నరేంద్ర మోడీ బయోపిక్ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!
అప్పుడు జయలలిత... ఇప్పుడు ఇందిరా గాంధీ!
భారత రాజకీయాలలో ఉక్కు మహిళలుగా పేరు గాంచిన ఇద్దరి జీవిత కథలతో తెరకెక్కిన సినిమాల్లో నటించిన అరుదైన ఘనత కంగనా రనౌత్ సొంతం అని చెప్పాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో ఆమె టైటిల్ రోల్ చేశారు. అయితే... ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ 'ఎమర్జెన్సీ'లో ఆవిడ ఇందిరా గాంధీ పాత్ర చేశారు. మరి, ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Also Read: నాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!
నిజం చెప్పాలంటే... ఇటీవల కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించలేదు. భారీ డిజాస్టర్లు అయినవి కూడా కొన్ని ఉన్నాయి. మరి, 'ఎమర్జెన్సీ' ఆ ఫ్లాపుల పరంపరకు బ్రేకులు వేసి భారీ హిట్ కంగనాకు అందించాలని ఆశిద్దాం.