HanuMan Hindi Box Office Collections: సంక్రాంతి కానుకగా విడుదలయిన ‘హనుమాన్’ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ మూవీ హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ‘హనుమాన్’ విడుదలయ్యింది. ఇక హిందీ బాక్సాఫీస్‌పై ఈ సినిమా చేస్తున్న దండయాత్ర చూసి ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్ఛర్యపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ క్రియేట్ చేసిన ఎన్నో లోకల్ రికార్డులను ‘హనుమాన్’ బ్రేక్ చేసింది. ఇప్పటికీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా తన రన్‌ను కొనసాగిస్తూనే ఉంది.


మొదటిరోజు కలెక్షన్స్‌ను క్రాస్..


ముఖ్యంగా నార్త్ బాక్సాఫీస్‌పై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ‘హనుమాన్’ను జనవరి 12న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు నిర్మాత ఒక సందర్భంలో బయటపెట్టారు. ఇక ఈ సినిమా విడుదలయ్యి 11 రోజులు అవ్వగా.. మొదటిరోజు అమ్ముడుపోయిన టికెట్స్ కంటే 11 రోజు అమ్ముడుపోయిన టికెట్స్ సంఖ్య ఎక్కువ. అంతే కాకుండా.. ఈ సినిమా 11వ కలెక్షన్స్.. మొదటిరోజును బీట్ చేశాయి. ‘హనుమాన్’ సినిమా దేశవ్యాప్తంగా మొదటిరోజు రూ.2.15 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇక 11వ రోజు వచ్చేసరికి రూ.2.33 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ‘హనుమాన్’ కలెక్షన్స్ లెక్కలు చూసి ఇండస్ట్రీ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. కేవలం హిందీలోనే ఏకంగా రూ. 36.54 కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా.


‘ఫైటర్’తో ఢీ..


ఇప్పటికే ‘హనుమాన్’ హిందీ వెర్షన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడంతో పూర్తిగా రూ.50 కోట్ల నుండి 60 కోట్ల కలెక్షన్స్‌ను సాధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దానికి మధ్యలో ఒక పెద్ద సమస్య ఉంది. హృతిక్ రోషన్, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఫైటర్’ మూవీ జనవరి 26న విడుదలకు సిద్ధమయ్యింది. బాలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ‘ఫైటర్’ వల్ల ‘హనుమాన్’కు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక బీ టౌన్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. తన యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే హిందీలో ‘హనుమాన్’ కలెక్షన్స్ తగ్గే అవకాశాలు చాలానే ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.


ఫస్ట్ షో పూర్తయ్యాకే రిజల్ట్..


రిపబ్లిక్ డే వీకెండ్ కావడంతో ‘ఫైటర్’ విడుదలయినా కూడా ‘హనుమాన్’ కలెక్షన్స్‌కు గండిపడే అవకాశాలు తక్కువే అని మరికొందరు ఇండస్ట్రీ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ‘ఫైటర్’ కోసం ఎక్కువ స్క్రీన్స్‌ను రిజర్వ్ చేసి మూవీని భారీ ఎత్తులో విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఈ పోటీలో ఎవరు విన్నర్ అవుతారు అనేది ‘ఫైటర్’ ఫస్ట్ డే టాక్ విన్న తర్వాత అర్థమవుతుంది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ.. తేజ సజ్జాను రూ.100 కోట్ల హీరోగా నిలబెట్టింది. టాలీవుడ్ నుండి కేవలం టైర్ 1 హీరోలు మాత్రమే ఉన్న రూ.100 కోట్ల క్లబ్‌లో ఇప్పుడు తేజ కూడా యాడ్ అయ్యాడు. ఇక ఈ మూవీలో తనకు జోడీగా అమృత అయ్యర్ నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించింది.


Also Read: ఆస్కార్‌ నామినేషన్స్.. ఈసారి పోటీపడుతున్న సినిమాలివే!