Saif Ali Khan: తాజాగా ‘దేవర’ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేతికి సర్జరీ జరిగింది. ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యి ఆసుపత్రిలో చేరాడు సైఫ్. ఎన్‌టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’లో ఈ బాలీవుడ్ నటుడు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్న సమయంలో సైఫ్‌కు గాయాలు అయ్యాయని.. అందుకే ఆసుపత్రిలో చేరాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతలోనే చేతికి కట్టుతో ఫోటోగ్రాఫర్ల ముందుకు వచ్చాడు. బాండ్రాలోని తన ఇంటికి చేరుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. తనతో పాటు తన భార్య కరీనా కపూర్ కూడా ఉంది.
ఇది మొదటిసారి కాదు..
ముంబాయ్‌లోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ చేతికి సర్జరీ జరిగింది. జనవరి 23న సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు.. చేతికి కట్టుతో ఉన్న సైఫ్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనవరి 22న ఈ బాలీవుడ్ నటుడికి ట్రైసెప్ సర్జరీ జరిగినట్టు సమాచారం. ‘దేవర పార్ట్ 1’ షూటింగ్ సమయంలో చేతికి జరిగిన గాయం వల్ల సైఫ్‌కు ఈ సర్జరీ జరిగింది. ఈ సీనియర్ బాలీవుడ్ నటుడికి షూటింగ్స్‌లో గాయాలు అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. 2017లో ‘రంగూన్’ అనే మూవీ షూటింగ్ సమయంలో కూడా తన చేతివేలికి గాయం అవ్వడంతో.. అప్పుడు కూడా సైఫ్‌కు సర్జరీ జరిగింది.
విలన్‌గా ఫస్ట్ లుక్..
‘దేవర పార్ట్ 1’లో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడనే విషయం రివీల్ చేయడంతో పాటు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. ఇక తాజాగా యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం ‘దేవర’ సెట్స్‌లో అడుగుపెట్టాడు సైఫ్. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అవ్వగా ‘దేవర’.. అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. పైగా ఈ మూవీ నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, తాజాగా విడుదలయిన గ్లింప్స్.. దీనిపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి.
‘దేవర’లో ఒక రేంజ్ వైలెన్స్..
కొరటాల ముందు సినిమాల్లో లేని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని ‘దేవర’ నుంచి విడుదలయిన అప్డేట్స్ చూస్తే అర్థమవుతోంది. పైగా మూవీలో వైలెన్స్ కూడా బాగానే ఉంటుందని తానే స్వయంగా ప్రకటించాడు కూడా. ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ను ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో రిలీజ్ చేశారు మేకర్స్. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్న దేవర ఫస్ట్ పార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'దేవర' నుంచి అదిరిపోయే గ్లింప్స్ షేర్ చేయగా.. నెట్టింట మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది.
Also Read: 'సైరెన్' మోగేది ఓటీటీలో కాదు, థియేటర్లలోనే.. కీర్తి సురేష్ కొత్త మూవీ రిలీజ్ ఎప్పుడంటే?