Foods that Fight Cancer : ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో ఆహారం గణనీయమైన పాత్ర పోషిస్తుంది అంటున్నారు క్యాన్సర్ నిపుణులు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆహార కాలుష్యం క్యాన్సర్​లకు కారణమయ్యే అంశాలను ప్రేరేపిస్తుందని తెలిపారు. ఆహార కాలుష్యం అంటే తీసుకునే ఆహారంలో ఎక్కువ కెమికల్స్ కలిసిపోవడం. ఈ నేపథ్యంలో ఆహార నాణ్యత నియంత్రణ ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయినప్పటికీ క్యాన్సర్, ఆహారం మధ్య పరస్పర సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. మంచి ఆహారం తీసుకుంటే.. మంచి ఆరోగ్యం పొందవచ్చు అంటున్నారు. దీనిలో భాగంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలిగే ఫుడ్స్​ లిస్ట్​ని విడుదల చేశారు. ఆ లిస్ట్ ఏంటో.. వాటిలో ఉన్న ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


పసుపు


ప్రతి ఇంట్లో పసుపు ఉంటుంది. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. గాయాలను తగ్గించుకోవడం కోసం దీనిని ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తాయి. రోజువారీ పసుపు తీసుకోవడం వల్ల గాయాలు దాదాపు 40శాతం తగ్గుతాయి. కాబట్టి దీనిని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 


దాల్చిన చెక్క


క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించడంలో దాల్చినచెక్క బాగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి. క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి దాల్చిన చెక్కను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. 


నట్స్ 


వివిధ ఆహార, ఆరోగ్య సంఘం ఫోరమ్​ల ప్రకారం నట్స్​లలో సెలీనియం ఉంటుంది. ఇది రోజూవారీ శక్తిని సరఫరా చేయడానికి, శరీరంలోని విషాన్ని తగ్గించడానికి, గుండె, క్యాన్సర్ రుగ్మతలను నిరోధిస్తుందని పలు పరిశోధనలు నిరూపించాయి. నట్స్​ను రెగ్యూలర్​గా తీసుకునేవారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని గమనించారు. కాబట్టి నట్స్​ను మీ డైట్​లో చేర్చుకుంటే మంచిది అంటున్నారు. 


బ్రోకలీ


బ్రోకలీలో సల్ఫోరాఫెన్ ఉంటుంది. ఇది క్యాన్సర్​ నివారణలో సహాయపడుతుంది. క్రూసిఫరస్ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్​తో బాధపడుతున్న వారిలో క్యాన్సర్​ పురోగతి రేటును తగ్గిస్తుంది. కాబట్టి దీనిని డైట్​లో చేర్చుకోవాలి అంటున్నారు. 


క్యారెట్లు


వీటిలో బీటా కెరోటిన్​ ఉంటుంది. ఇది కణత్వచాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యాన్సర్​ రాకుండా కాపాడుతుంది. దీనిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ కేసులను తగ్గిస్తుందని పరిశోధనలు తెలిపాయి. కాబట్టి వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిదంటున్నారు. 


బీన్స్


అధిక ఫైబర్, ప్రోటీన్ రిచ్​ ఫుడ్​లలో బీన్స్ ఒకటి. ఇవి దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి.. క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధించడంలో హెల్ప్ చేస్తుంది. సమస్యను తగ్గేలా చేస్తుంది. బీన్స్ తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, కొలెరెక్టల్ ట్యూమర్​ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. 


ఇవే కాకుండా బెర్రీలు కూడా క్యాన్సర్ నిరోధించడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఇవి క్యాన్సర్​ను పూర్తి స్థాయిలో తగ్గిస్తాయని అర్థం కాదు. రాకుండా, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే వీటిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు. ఈ ఫుడ్ మీ ఆహార వ్యవస్థను శుభ్రపరుస్తుంది. తద్వారా క్యాన్సర్లను సులువుగా నిరోధించడానికి హెల్ప్ అవుతుంది. 


Also Read : మంచి బాడీ షేప్​ కావాలంటే ఇంట్లోనే ఈ ట్రాప్ వ్యాయామాలు చేసేయండి