Doctor Eats Cow Dung: ఆవు పేడ తింటున్న డాక్టర్.. కారణం అడిగితే ఏం చెప్పారో చూడండి

గోమాత్రం తాగేవాళ్లను మీరు చూసే ఉంటారు. అయితే, ఈ డాక్టర్ ఏకంగా ఆవు పేడనే తినేస్తున్నాడు.

Continues below advertisement

రోగ్యం కోసం కొందరు గోమూత్రం (ఆవు మూత్రం) తాగుతారనే సంగతి మనకు తెలిసిందే. అయితే, హర్యానాకు చెందిన ఓ డాక్టర్ ఏకంగా ఆవు పేడను గులాబ్ జామ్‌లా లొట్టలేసుకుని మరీ తినేస్తున్నాడు. అన్ని విషయాలు తెలిసిన డాక్టరైయ్యుండి మీరే ఇలా చేస్తే ఎలా? అని ప్రశ్నిస్తే.. ‘‘డాక్టర్‌ను కాబట్టే తింటున్నా. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకేం తెలుసు?’’ అని అడుగుతున్నాడు.

Continues below advertisement

హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన పిల్లల వైద్యుడు (Pediatrician) డాక్టర్ మనోజ్ మిట్టల్ ఇటీవల ఓ ఆన్‌లైన్ వీడియోలో ఆవు పేడ గురించి ప్రయోజనాలు చెప్పాడు. చెబితే.. పర్వాలేదు.. ఏకంగా ఆ పేడను నోట్లో పెట్టుకుని తినేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో విమర్శలు గుప్పుమన్నాయి. ఇదేం గబ్బు పని అంటూ ఆయన్ని తిట్టిపోశారు. అయితే, మిట్టల్ మాత్రం.. తగ్గేదేలే అంటూ తన చర్యలను సమర్దించుకున్నాడు. 

ఆవు పేడ అనేది భారత సాంప్రదాయ ఔషదమని, ఇది క్యాన్సర్, కోవిడ్-19 వంటి రోగాలను సైతం నయం చేస్తుందంటూ ఇటీవల పెద్ద ప్రచారమే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఇది రుజువు కాలేదు. దీంతో వైద్యులు కూడా దీన్ని సిఫార్సు చేయడం లేదు. పైగా.. పేడ అంటే కడుపులోని వ్యర్థమని, అందులో బోలెడన్ని బ్యాక్టీరియాలు ఉంటాయని, వాటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఎలా చెప్పగలమని వాదించారు. 

అయితే, మిట్టల్ మాత్రం.. ఆవు పేడ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నాడు. పేడ తింటే.. శరీరం, మనస్సు మరియు ఆత్మకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని తెలిపాడు. ‘‘ఆవు నుంచి లభించే పంచగవ్యలోని ప్రతి భాగం మానవాళికి ఎంతో విలువైనది. మనం ఆవు పేడ తింటే.. మన శరీరం, మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. మన ఆత్మ కూడా కల్మషం లేకుండా ఉంటుంది. ఇది ఒకసారి శరీరంలోకి చేరిందంటే చాలు.. బాడీ మొత్తాన్ని శుభ్రం చేస్తుంది’’ అని వివరించాడు. 

Also Read: భలే ఆఫర్.. ఆ ఇళ్లల్లో ఒంటరిగా ఉంటే నిమిషానికి రూ.12 చెల్లిస్తారట, కానీ.. అంత ఈజీ కాదు

‘‘మా అమ్మ తన ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి ఆవు పేడను తింటుంది. మహిళలు ఆవు పేడను తింటే.. బిడ్డను ప్రసవించడానికి సిజరియన్‌ కూడా అవసరం ఉండదు’’ అని తెలిపాడు. మిట్టల్.. ఆవు పేడను బ్రెడ్ తింటున్నట్లుగా తింటుంటే.. సోషల్ మీడియాలో కొందరు సపోర్ట్ కూడా చేశారు. భారత ప్రాచీన ఔషదంపై ఆయన అవగాహన కలిగిస్తున్నాడని పలువురు కామెంట్లు కూడా చేశారు. కొందరు మాత్రం.. ఆయన తన వెర్రితనాన్ని ఇలా ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లల డాక్టర్‌గా చిన్నారులకు పేడ పెట్టండని చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. 

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Continues below advertisement
Sponsored Links by Taboola