Brain Boosting Foods : మెదడు ఆరోగ్యం, బ్రెయిన్ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీన ప్రపంచ మెదడు దినోత్సవాన్ని (World Brain Day 2025) నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ 2014 నుంచి దీనిని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం మెదడుకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఫుడ్స్​ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. 

ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ తింటే హెల్తీగా ఉంటారు. అయితే మెదడు ఆరోగ్యానికి కూడా ఫుడ్ ఎంతో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహారాలు రెగ్యులర్​గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆకు కూరల నుంచి నట్స్ వరకు మెదడు ఆరోగ్యాన్ని ప్రేరేపించే ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. 

వాల్​నట్స్..

బ్రెయిన్ హెల్త్​ అని గుర్తొస్తే ఆ ఫుడ్స్ లిస్ట్​లో వాల్​నట్స్ కచ్చితంగా ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు మతిమరుపును దూరం చేస్తాయి. రెగ్యులర్​గా వాల్​నట్స్ తింటే అల్జీమర్స్ సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుందట. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది.

ఆకుకూరలు

పాలకూర, కాలే, బ్రొకోలి వంటి ఆకుకూరలు బ్రెయిన్ హెల్త్​ని బూస్ట్ చేస్తాయి. వీటిలో విటమిన్ కె, ఫోలేట్, లూటిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడడంతో పాటు మతిమరుపు సమస్యను దూరం చేస్తాయి. ఇవి కేవలం మెదడు ఆరోగ్యానికే కాదు గుండె ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి.

డార్క్ చాక్లెట్ 

స్వీట్ క్రేవింగ్స్​ని దూరం చేసి.. బ్రెయిన్ హెల్త్​ని ప్రమోట్ చేసే ఆహారాల్లో డార్క్ చాక్లెట్ ఒకటి. దీనిలోని ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మూడ్​ని మెరుగుపరుస్తాయి. కొన్ని అధ్యయనాలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల బ్రెయిన్​లో రక్త ప్రసరణ మెరుగవుతుందని తెలిపాయి. అలాగే ఫోకస్ పెంచడంలో హెల్ప్ చేస్తాయట. 70 శాతం కోకో ఉండే వాటిని ఎంచుకుంటే మంచిది.

చేపలు 

ఫ్యాటీ ఫిష్​లు కూడా బ్రెయిన్ హెల్త్​ని ప్రమోట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సాల్మాన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని తగ్గంచి.. అల్జీమర్స్ వ్యాధిని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. మంచి మూడ్​ని ప్రమోట్ చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుచేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని వారంలో రెండుసార్లు అయినా ఉండేలా చూసుకుంటే మంచిది. 

బెర్రీలు 

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్​బెర్రీలలోని ఫ్లేవనాయిడ్స్ బ్రెయిన్ మెమోరీని పెంచుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వారంలో రెండుసార్లు బెర్రీలు తింటే మతిమరుపు సమస్యలు రెండు సంవత్సరాల్లో దూరమవుతాయట. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయట. 

కెఫిన్ కూడా లిమిటెడ్​గా తీసుకుంటే మూడ్ మెరుగవడంతో పాటు.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని సూచిస్తున్నారు. అవిసెగింజలు, అవకాడోలు, గుమ్మడి గుంజలు కూడా బ్రెయిన్ హెల్త్​ని ప్రమోట్ చేసే హెల్తీ ఫుడ్స్​గా చెప్తున్నారు. వంటలను ఆలివ్ ఆయిల్​తో చేసుకోవడం వల్ల పూర్తి శరీరానికే కాదు బ్రెయిన్ హెల్త్​కి కూడా మేలు జరుగుతుందని చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.