Healthy Food for Heart : కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే టాప్ 6 ఫుడ్స్ ఇవే
ఓట్స్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది ధమనులను బ్లాక్ అవ్వకుండా కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సాల్మన్ లేదా సార్డినెస్ వంటి కొవ్వు చేపలు గుండెకు చాలా మంచివిగా చెప్తారు. ఇవి ట్రైగ్లిజరైడ్లను నియంత్రిస్తాయి. రక్తపోటును సమతుల్యం చేస్తాయి.
పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరలు, కూరగాయలలో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ధమనులకు స్థితిస్థాపకతను ఇస్తాయి.
ఆలివ్ ఆయిల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
డార్క్ చాక్లెట్లో 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉంటుంది. ఇవి ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండెను ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.