Healthy Foods for Bones : ఎముకలు వీక్‌గా ఉన్నాయా? బోన్స్ బలంగా మారాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే
పాలల్లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు వేడి పాలు తాగితే మంచిది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాలకూర, మెంతికూరలతో పాటు.. పలు కూరగాయలలో కాల్షియం, ఐరన్ రెండూ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
నువ్వులు, రాగి రెండూ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలే. కాబట్టి రోజూ నువ్వుల లడ్డూ లేదా రాగి రొట్టె లేదా రాగి జావను తీసుకుంటే మంచిది.
బాదం, వాల్‌నట్స్‌లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలకు పోషణనివ్వడంలో సహాయపడతాయి. కాబట్టి ఇవి రోజూ డైట్లో ఉండేలా చూసుకోండి.
గుడ్డులోని ప్రోటీన్.. ముఖ్యంగా పచ్చసొనలో లభించే విటమిన్ D ఎముకల బలానికి చాలా అవసరం. కాబట్టి గుడ్డును ఉడకబెట్టి రోజు డైట్లో తీసుకోవచ్చు.
వీటితో పాటు ప్రతిరోజూ ఉదయం 15-20 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల శరీరానికి విటమిన్ D అందుతుంది. దీనివల్ల కాల్షియం శరీరంలోకి బాగా వెళ్లి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి.