Ram Charan Body Transformation for Peddi Movie : టాలీవుడ్‌లో చిరుతతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్(Ram Charan).. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌(Global Star)గా ఎదిగారు. మొదటి సినిమా నుంచే ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన చెర్రీ, ప్రతి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తన బాడీని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తూ వచ్చారు. పెద్ది కోసం అయితే.. మరింత బల్కీ లుక్‌ (Ram Charan Peddi Movie Transformation) తీసుకుని వచ్చాడు. ఆ ఫొటోలు చూసిన అభిమానులు "ఏమున్నాడ్రా బాబు!" అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Continues below advertisement


ఎన్నో ఏళ్ల కష్టం.. 


రామ్ చరణ్ తన బాడీ ట్రాన్ఫర్మేషన్​ కోసం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నారని.. రాకేశ్ ఉద్దీయార్ తెలిపారు. కొన్ని నెలల్లో అలాంటి బాడీ ట్రాన్ఫర్మేషన్​ కావాలి అనుకుంటే అది కష్టమన్నారు. ఆర్నెళ్లల్లోనే అలాంటి లుక్స్ తెప్పిస్తామంటూ కొందరు ట్రైనర్స్ ప్రమోట్ చేసుకుంటున్నారు అంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. అది చాలా కష్టమని చెప్తూ.. "Wow.. that means they gonna buy ram charans DNA ha" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఓవర్​నైట్​లో బాడీని ఫిట్​గా మార్చుకోవడం జరగదని.. ఎన్నో ఏళ్ల కృషి ఉంటేనే రామ్ చరణ్ లాంటి బాడీ సాధ్యమని చెప్పారు. 






రామ్ చరణ్ వర్క్​అవుట్ రొటీన్


రామ్ చరణ్ సోమవారం చెస్ట్ వర్క్​అవుట్ షెడ్యూల్ ఫాలో అవుతారట. దీనిలో భాగంగా కేబుల్ ఫ్లే, సిట్​అప్స్, యాబ్స్ పాలెట్ ట్విస్ట్, బార్బెల్ ఫ్లోర్ వైపర్, బెంచ్ ప్రెస్, వాకింగ్, పుష్​అప్స్ చేస్తారట. మంగళవారం షోల్డర్స్, కోర్ వర్క్​ అవుట్ షెడ్యూల్ ఫాలో అవుతారట. దానిలో భాగంగా డంబుల్స్, మిలటరీ ప్రెస్, ఫ్లోర్ షోల్డర్ ప్రెస్, ఆర్నాల్డ్ ప్రెస్, పల్స్ అప్, సిజర్ కిక్స్, లెగ్ రొటేషన్స్ చేస్తారట. 


బుధవారం బ్యాక్ అండ్ బైసెప్స్ వర్క్​అవుట్స్. దీనిలో భాగంగా షర్గ్స్, బెంట్ ఓవర్ రో, చిన్ అప్స్, వైడ్ గ్రిప్ లాట్ పుల్​ డౌన్, అప్​రైట్ రో, హ్యామర్ కర్ల్ చేస్తారు. గురువారం బ్యాక్ అండ్ చెస్ట్ వర్క్ అవుట్స్ చేస్తారు. దీనిలో భాగంగా బెంచ్ ప్రెస్, సిట్ అప్స్, క్లోజ్ గ్రిప్ పుష్​అప్స్, యాబ్స్, బార్బెల్ ఫ్లోర్ వైపర్, ట్రిపుల్ స్టాప్ బెంచ్ ప్రెస్, ఎలివేటెడ్ ఫీట్ పుష్​ అప్స్, రెనిగెడ్ రో, పుల్​ అప్స్ చేస్తారు. శుక్రవారం చేతులు, లెగ్స్​కి సంబంధించిన వర్క్​ అవుట్స్ చేస్తారు. దీనిలో భాగంగా స్క్వాట్స్, రోప్ ట్రై సెప్ పుష్​డౌన్స్, డెడ్​లిఫ్ట్స్, క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్ చేస్తారు. ఇవే కాకుండా వీకెండ్స్​లో స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, కిక్​బాక్సింగ్ చేస్తారట చెర్రీ.


రామ్ చరణ్ డైట్ ఎలా ఉంటుందంటే..​


చెర్రీ పూర్తిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ 8 గంటలకు 2 గుడ్లు, 3 ఎగ్ వైట్స్, బాదం పాలు, ఓట్స్.. మార్నింగ్ స్నాక్ 11కి క్లీన్ వెజ్ సూప్.. మధ్యాహ్న భోజనం 1:30కు 200g చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, కూరగాయలు ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ 4కి ఉడకబెట్టిన కూరగాయలు, చిలగడదుంప తీసుకుంటారు. డిన్నర్ 6లోపే ముగించేస్తారు. గ్రీన్ సలాడ్, అవకాడో, నట్స్ డిన్నర్​లో ఉంటాయి. రామ్ చరణ్ డైట్‌లో ఆల్కహాల్, కెఫిన్, షుగర్, రెడ్ మీట్, గోధుమ ఉత్పత్తులు ఉండవు. ఇంకా 12 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తారని తెలిపారు.


వర్కౌట్ కన్నా డైట్ కీలకం


“Every transformation – diet is very important. If your diet is not right, you're gone… no matter what you do,” దీనిని దృష్టిలో పెట్టుకుని లైఫ్​స్టైల్​కి తగ్గట్లు డైట్ ప్లాన్ చేసుకోవాలన్నారు రాకేష్. రామ్ చరణ్ ఫిట్‌నెస్ అంతా కేవలం ట్రైనింగ్‌తో కాదు.. డిసిప్లిన్‌తో కూడిన డైట్ వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు.