Boost Your Weight Loss with These Foods : బరువును తగ్గించడం ఏ ఒక్క ఫుడ్​తో సాధ్యం కాదు. కానీ బరువు తగ్గడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడమనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి హెల్తీ రొటీన్​ను ఫాలో అవుతూ బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఏ ఫుడ్స్​ని తీసుకుంటే బరువు తగ్గడం సులభమవుతుంది.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. 


బరువు తగ్గడానికి మీరు తీసుకునే ఫుడ్, క్వాంటిటీ చాలా ముఖ్యం. బ్యాలెన్స్డ్​ డైట్​ ఫాలో అవుతూ శరీరానికి తగిన పోషకాలు అందిచాల్సి ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. దీనివల్ల కేలరీలు తగ్గుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, హెల్తీ ఫ్యాట్స్ మెటబాలీజం పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. అవేంటంటే.. 


చియా సీడ్స్ 


చియా సీడ్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా చేసి.. జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. దీనివల్ల మీరు తక్కువ కేలరీలు తీసుకోగలుగుతారు. కాబట్టి దీనిని రోజుకు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చని చెప్తున్నారు. మీరు దీనిని బ్రేక్​ఫాస్ట్​లో లేదా సలాడ్స్​లో ఇతర పదార్థాలతో కలిపి లేదా నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకున్నప్పుడు కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. 


యాపిల్స్ 


యాపిల్స్​లో నీటి శాతం, ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. వీటిని తక్కువగా తీసుకున్నా శరీరానికి శక్తి అందుతుంది. కేలరీలు తక్కువగా ఉండే వీటిని తీసుకుంటే ఆరోగ్యానికే కాకుండా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతాయి. వీటిని మంచి స్నాక్​గా తీసుకోవచ్చు. లేదా సలాడ్స్​లో తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. 


శనగలు


శనగల్లో ఫైబర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్​, ఇతర పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని బరువు తగ్గడానికి సపోర్ట్​గా తీసుకోవచ్చు. ఇవి శక్తిని అందించడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని సలాడ్స్​లో లేదా సూప్స్​లో లేదా రోస్ట్​ చేసి డిష్​లలో టాపింగ్​గా వేసుకోవచ్చు. సోడియం తక్కువగా ఉండే వాటిని ఎంచుకుంటే మరీ మంచిది. 


వాల్​నట్స్ 


ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉండే వాల్​నట్స్​ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్​గా డైట్​లో చేర్చుకోవచ్చు. 


నట్స్ అండ్ సీడ్స్ 


నట్స్​లో ప్రోటీన్, ఫైబర్, అన్​శాచ్యూరేటెడ్  ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. అలాగే సీడ్స్​లో మినరల్స్, అన్​శాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటీని లిమిటెడ్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. వీటిని స్నాక్స్​గా, సలాడ్స్​లో కలిపి తీసుకుంటే బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తాయి. 


తృణధాన్యాలు


తృణధాన్యాల్లో ఫైబర్, ఇతర విటమిన్​లు పుష్కలంగా ఉంటాయి. వివిధ పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. కాబట్టి వీటిని కూడా డైట్​లో చేర్చుకుంటే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు చూడవచ్చు. 


అవకాడో


అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా చేసి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. క్రమంగా ఫుడ్​ క్వాంటిటీని తగ్గించి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. అయితే దీనిని లిమిటెడ్​గా తీసుకుంటే మంచిది. 


వీటిని రెగ్యులర్​గా తీసుకుంటూ వ్యాయామం చేస్తూ.. కంటి నిండా నిద్రపోతూ.. ఒత్తిడిని కంట్రోల్ చేసే టిప్స్ ఫాలో అయితే బరువును వేగంగా తగ్గగలుగుతారని చెప్తున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేసుకోవడానికి వీటిని కూడా డైట్​లో చేర్చేసుకోండి. 



Also Read : సమ్మర్​లో ఖర్బూజ తింటే చాలా మంచిది.. కానీ గింజలతో డబుల్ బెనిఫిట్స్ ఉన్నాయట, పడేయకండి