Musk Melon and Seeds Benefits : ఖర్బూజ పండును చాలామంది వేసవిలో తీసుకుంటూ ఉంటారు. సమ్మర్​లో దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. వేసవి తాపాన్ని తగ్గించి.. శరీరంలోని వేడిని కంట్రోల్ చేసి.. చల్లని అనుభూతిని ఇస్తుంది. అందుకే దీనిని జ్యూస్​ల రూపంలో, సలాడ్​ల రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ.. ఈ పండును తినేప్పుడు లోపలి సీడ్స్​ను చాలామంది పడేస్తారు. కానీ నిజం చెప్పాలంటే.. పండు కంటే ఖర్జూజ సీడ్స్​తోనే డబుల్ బెనిఫిట్స్ పొందవచ్చట. 


ఖర్బూజ సీడ్స్​ 100 గ్రాములు తీసుకుంటే.. దానిలో 7 శాతం హెల్తీ కార్బోహైడ్రేట్లు, 1 కంటే తక్కువ కొవ్వు, 2 శాతం ప్రొటీన్లు మీకు అందుతాయి. పైగా వీటిలో విటమిన్ ఎ, ఇ, సి, కెలతో పాటు మెగ్నీషియం, జింక్ మొదలైన ఖనిజాలు ఉంటాయి. అందుకే వీటిని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. మరి వీటివల్ల ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


బీపీ 


ఖర్బూజ పండు తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. వాటి గింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపిని సమర్థవంతంగా తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 


రోగనిరోధక శక్తికై.. 


ఖర్బూజ సీడ్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. వీటిలో ప్రొబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి గట్ హెల్త్​కి మంచివి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఇన్​ఫెక్షన్లను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. 


స్కిన్ హెల్త్​కి


వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గించి.. స్కిన్​కి యవ్వనమైన లుక్​ని అందించడంలో ఖర్బూజ సీడ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా స్కిన్ గ్లోకి మంచి ఫలితాలు ఇస్తాయి. అనేక చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి.. కొల్లాజెన్​ను అందిస్తాయి. చర్మకణజాలాలను టైట్ చేసి యవ్వనమైన లుక్​ని ఇస్తాయి. 


కంటి ఆరోగ్యానికి.. 


కళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కూడా వీటిని డైట్​లో చేర్చుకోవచ్చు. వీటిలోని విటమిన్ ఎ అంధత్వం సమస్యలను దూరం చేస్తుంది. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యానికి హెల్ప్ చేసి.. కంటి చూపును మెరుగుపరుస్తాయి. 


ఒత్తిడి దూరం 


ఒత్తిడి వల్ల మీరు బద్ధకంగా, డిప్రెషన్​తో, సరైన నిద్ర లేక, పనులపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారా? అయితే వీటిని మీరు డైట్​లో చేర్చుకోవచ్చు. ఇవి ఒత్తిడిని తగ్గించి.. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. 


గుండె ఆరోగ్యానికి.. 


ఖర్బూజ గింజల్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులను నివారించడంలో హెల్ప్ చేస్తాయి. మొత్తం ఆరోగ్యానికే కాకుండా.. కార్డియో హెల్త్​కోసం వీటిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు. 


మలబద్ధకం దూరం


ఖర్బూజ సీడ్స్ మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి. ఎసిడిటీ సమస్యను తగ్గించి.. యాసిడ్ రిఫ్లక్స్​ను తగ్గిస్తాయి. మీరు దీర్ఘకాలికంగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నా.. దీనిని రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. 


మరిన్ని ప్రయోజనాలు.. 


ఖర్బూజ గింజలు గర్భిణి స్త్రీలు తింటే.. చాలా మంచిదట. వీటిలోని ఫోలేట్ శరీరంలోని అదనపు సోడియంను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. వేసవికాలంలో శరీరం వేడికి ఇబ్బందిపడకుండా.. కూల్ చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది. వీటిలోని పొటాషియం కంటెంట్ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని నేరుగా తినొచ్చు. ఎండబెట్టి కూడా తినొచ్చు. మీరు డైట్​లో వీటిని చేర్చుకోవాలనుకుంటే.. వైద్యుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 



Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే.. డెలివరీ సమయానికి స్ట్రాంగ్​గా అవుతారట








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.