Cancer: చాలా మందిని వెన్నునొప్పి వేధిస్తుంది, దీన్ని సాధారణ నడుము నొప్పిగా పరిగణించి పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ లక్షణంగా మారవచ్చు. ఏది ఏ నొప్పో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెన్నునొప్పి దీర్ఘకాలంగా వేధిస్తుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వెన్నునొప్పితో పాటూ కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. వెన్నునొప్పి మూడు రకాల క్యాన్సర్లకు సంకేతంగా భావించవచ్చు. ఈ మూడు క్యాన్సర్లకు నడుము నొప్పి కూడా ఒక ప్రధాన లక్షణమే.
మూత్రాశయ క్యాన్సర్
మూత్రాశయం మీ పొత్తికడుపులో మూత్రాన్ని నిల్వ చేసే అవయవం. నడుము నొప్పి మూత్రాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. మూత్రాశయంలోని లోతైన కణజాలంపై కణితులు పెరిగి క్యాన్సర్ గా మారతాయి. ముఖ్యంగా వెనుకవైపు దిగువన వచ్చే వెన్నునొప్పి మూత్రాశయ క్యాన్సర్ కొత్త లక్షణంగా గుర్తించారు.
వెన్నెముక క్యాన్సర్
వెన్నెముక క్యాన్సర్‌కు కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంవి. వెన్నెముకపై వచ్చిన కణితుల వల్ల నొప్పి నిరంతరంగా వస్తుంది. అయితే ఇది శరీరభాగాలకు వ్యాప్తి చెందదు.వెన్నునొప్పి అనేది వెన్నెముక క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ నొప్పి తీవ్రంగా మారి కాళ్లు, చేతులు, ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
ఊపిరితిత్తుల క్యాన్సర్
వెన్నునొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణం కూడా .మీరు వెన్నునొప్పితో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే జాగ్రత్త పడాలి. రెండు రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఈ లక్షణాలు కూడా కనిపిస్తే
వెన్నునొప్పితో పాటూ ఈ లక్షణాలు కూడా కనిపిస్తే చాలా జాగ్రత్త పడాలి.
- మూత్రాశయ క్యాన్సర్ వల్ల వెన్నునొప్పితో పాటూ తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం పడడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి ఉంటాయి.
-వెన్నెముక క్యాన్సర్ సంకేతాలలో వెన్నునొప్పితో పాటూ తిమ్మిరి, బలహీనత, చేతులు,కాళ్ళలో సమన్వయ లోపం, పక్షవాతం కూడా కనిపిస్తాయి.
- ఇక ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో దగ్గినప్పుడు రక్తం పడడం, శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలంగా ఉండే దగ్గు కూడా కనిపిస్తాయి.
Also read: పెళ్లయిన తొలిరాత్రి భార్యాభర్తలు పాలు తాగడం వెనుక అసలు లాజిక్ ఇదే
Also read: మీ ముఖంలో ఈ మార్పులు వచ్చాయా? థైరాయిడ్ ఏమో చెక్ చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.