కోక్ రిఫ్రెషింగ్ రుచి చాలా మందికి నచ్చుతుంది. కానీ ఇందులో ఉండే చక్కెరకు భయపడి తాగేందుకు జంకుతారు. అలాంటి వారంతా కూడా డైట్ కోక్ ను తాగేందుకు మొగ్గుచూపుతారు.
కరెంట్ అథెరోస్క్లెరోసిస్ రిపోర్ట్స్ లో ప్రచురించిన పరిశోధనా ఫలితాల్లో డైట్ కోక్ వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని చెబుతున్నారు. ఈ డ్రింక్ సిప్ చేసిన నిమిషనిమిషానికి శరీరంలో జరిగే మార్పుల గురించి ఈ పరిశోధకులు వివరించారు.
- మొదటి పది నిమిషాల్లో దంతాల మీద దాడి చేస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన పానియంగా పేరుపొందిన ఈ డ్రింక్ తీసుకున్న పదినిమిషాల్లోపు దీనిలోని ఆసిడ్ దంతాల మీద దాడి ప్రారంభిస్తుందని ది రెనెగేడ్ ఫార్మసిస్ట్ హెచ్చరిస్తున్నారు. ఈ డ్రింక్ లోని ఆసిడ్ దంతాల మీదున్న ఎనామిల్ మీద దాడి చేస్తుంది. దీర్ఘకాలంలో దంతాల్లో సెన్సిటివిటికీ, దంతాలు పుచ్చిపోవడానికి కారణం అవుతుంది కూడా. డైట్ కోక్ కూడా మిగతా అన్ని కార్బోనెటెడ్ పానీయాల లాంటిదే. ఇది వాటికి భిన్నమైందేమీ కాదని ఫేస్ టీత్ స్మైల్ డెంటల్ క్లీనిక్ కు చెందిన డాక్టర్ రాజ్ జునేజా అన్నారు. కార్బోనెషన్ ప్రక్రియ ద్వారా కార్బోనిక్ ఆసిడ్ చేర్చుతారు. దీని వల్లే ఈ డ్రింక్ ఫిజిగా మారుతుంది. డైట్ కోక్ లోని ఆమ్లతత్వం వల్ల దంతాల మీద ఎనామిల్ ను తొలగిస్తుంది.
- 20 నిమిషాల్లో కొవ్వుగా మారుతుంది. డైట్ కోక్ తీసుకున్న 20 నిమిషాల్లో అది శరీరంలో కొవ్వునిల్వల్లో చేరిపోతుంది.
ఇన్సులిన్ ఉత్పత్తి మీద అర్టిఫిషియల్ స్వీటెనర్ల ప్రభావాల గురించి జరిగిన అధ్యయనాలు రకరకాల ఫలితాలను వెల్లడించడాయని కొన్నింటి వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిందని యూకేకు చెందిన డయాబెటిస్ కేర్ కు చెందిన డగ్లస్ ట్వెనెఫోర్ వెల్లడి చేశారు. ఇన్సులిన్ కొవ్వు నిల్వల మీద ప్రభావాన్ని చూపుతుందని, అయితే డైట్ కోక్ లోని స్వీటెనర్లు హార్మోన్ స్థాయిలను పెంచుతున్నాయని, కొవ్వు నిల్వ చెయ్యడంలో ఇన్సులిన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. డైట్ కోక్ లో ఉపయోగించే స్వీటెనర్ల రకాలు ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద ప్రభావం చూపవచ్చు చూపకపోవచ్చు అనే అభిప్రాయాన్ని మోనాష్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, విక్టోరియన్ హార్ట్ హాస్పిటల్ లోని రీసెర్చ్ ఫెలో డాక్టర్ మాథ్యూస్నెల్సన్ అన్నారు.
డైట్ కోక్ మొదటి సిప్ చేసిన 40 నిమిషాల్లోపు వ్యసనం వంటి అడిక్టివ్ హై భావన కలిగిస్తుంది. కోక్ లో ఉండే కెఫిన్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్ అస్పార్టమే రెండు కలిస్తే ఒక అడిక్టేటివ్ హై కలుగుతుంది. ఫలితంగా శరీరంలో ఎక్సిటోటాక్సిన్లు విడుదలవుతాయి. ఇది మెదడులోని న్యూరోరిసెప్టార్లను పరిమితికి మించి ప్రేరేపించడంవల్ల రోజూ తీసుకున్నపుడు మెదడు త్వరగా అలసిపోతుంది. కొంత మందికి ఇది వ్యసనంగా మారవచ్చు. కోకొకోలా కంపెని ఇచ్చిన వివరాల ప్రకారం 330మి.లీ. ల క్యాన్ లో 42 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది.
మొదటి సిప్ తీసుకున్న 60 నిమిషాల్లోపు మునుపటి కంటే ఎక్కువ దాహం వేస్తుంది. ఒక గంటలోపు ఆకలి కూడా మొదలవుతుంది. డైట్ కోక్ లో ఉండే కెఫిన్ డీహైడ్రేట్ చేస్తుంది. కెఫిన్ డైయూరేటిక్ కనుక గంటలోపే మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తుంది. డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో నీరు తగ్గితే డీహైడ్రేట్ అవుతుంది. కెఫిన్ కిడ్నీలకు రక్త ప్రసరణను పెంచడం వల్ల శరీరంలో మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతకాదు ఆకలిగా కూడా అనిపిస్తుంది. చాలా మంది డీహైడ్రేట్ అయినపుడు ఆకలిగా ఉన్నట్టు ఫీల్ అవుతారు.
డైట్ కోక్ అయినా నార్మల్ కోక్ అయినా కోక్ ఏదైనా, ఏరూపంలో ఉన్నా అది ఆరోగ్యానికి చేసే మేలు ఏమీ లేదని మాత్రం ఈ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
Also read : మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.