మధుమేహం.. ఒంట్లోనే తిష్టవేసే తీయని స్లో పాయిజన్. దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ తీపి వ్యాధి ముదిరితే.. అవయవాలు కూడా పాడైపోతాయి. బయటకు ఆరోగ్యంగా కనిపించినా.. చక్కెర లోపల నుంచి చంపేస్తుంది. అందుకే, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. వారికి ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే.. డయాబెటిస్ సమస్యను మరింత పెంచేస్తుంది. చివరికి చికిత్స చేయడానికి సాధ్యం కాకుండా చేస్తుంది.
ఇటీవల అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. తీవ్రమైన చిగుళ్ల వ్యాధి (పీరియాడోంటిటిస్)తో బాధపడేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమైతే.. చిగుళ్ల వ్యాధి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ADAలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మధుమేహం బాధితులకు చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
చిగుళ్ల వ్యాధి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడుతుంది. దీన్ని వెంటనే గుర్తించి చికిత్స పొందాలి. లేకపోతే దంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దంతాలకు సపోర్టుగా ఉండే ఎముకను ఇన్ఫెక్షన్ నాశనం చేస్తుంది. చిగుళ్ల వ్యాధి ఒక ఇన్ఫెక్షన్ కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చిగుళ్లలో ఏర్పడే గాయాలు నయమయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల మధుమేహం ఉన్నవారికి చికిత్స చేయడం కష్టమవుతుంది. దంతాలను తొలగించడం లేదా మరేదైన నోటి సర్జరీని నిర్వహించిన తర్వాత కోలుకోడానికి ఎక్కువ సమయం పడుతుంది.
Also Read: ఛీ.. దరిద్రుడు, కారు నడుపుతూ డ్రైవర్ పాడుపని.. మహిళకు ఊహించని చేదు అనుభవం
ADA అధ్యయనంలో పరీక్షించిన మధుమేహ వ్యాధిగ్రస్తులలో దాదాపు 28 శాతం మంది తమ దంతాలన్నింటినీ కోల్పోయారు. రక్తంలో ఉండే అదనపు గ్లూకోజ్ చిగుళ్ల వ్యాధి, ఇన్ఫె్క్షన్ సంభావ్యతను పెంచుతుంది. కాబట్టి.. మీ నోటిలో ఏమైనా సమస్యలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి. చిగుళ్ల సమస్య ఉన్నవాళ్లు స్మోకింగ్ మానేయాలి. ఎందుకంటే ధూమపానం మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. చిగుళ్ల(గమ్) ఇన్ఫెక్షన్‌తో పోరాడటం కష్టతరం చేస్తుంది. కాబట్టి.. మీరు ఇంట్లో ఎప్పటికప్పుడు డయాబెటిక్ స్థాయిలను తెలుసుకోవాలి. కాబట్టి చిగుళ్ల సమస్యపై అప్రమత్తంగా ఉండడి. పళ్లు మొత్తం ఊడిపోయేంత ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు.
Read also: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది