బెంగళూరులో ఓ మహిళకు ఎదురైన చేదు అనుభవం ఇది. రాత్రి వేళ ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న ఓ లేడీ జర్నలిస్ట్.. డ్రైవర్ చేసిన పాడుపని చూసి షాకైంది. అతడి తీరుకు హడలిపోయింది. చిమ్మ చీకట్లో సాయం కోసం బిక్కుబిక్కుమంటూ గడిపింది.
బెంగళూరుకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు డ్యూటీ ముగించకుని ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. కారు నడుపుతూనే డ్రైవర్ ఆమెను అదోలా చూడటం మొదలుపెట్టాడు. వింతగా ప్రవర్తిస్తుండటంతో.. అతడిని పరిశీలనగా చూసింది. అంతే.. ఆ తర్వాత ఆమెకు నోట మాట రాలేదు. అతడు తన దోతిని పక్కకు పైకెత్తి.. స్వయంతృప్తి పొందుతున్నాడు. అది చూడగానే.. ఆమె గట్టిగా కేకలు వేసింది. వెంటనే కారు ఆపాలని కోరింది. దీంతో అతడు కారును ఆపేసి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు.
ఆమెకు ఎదురైన ఈ పరిస్థితిని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తన ట్వీట్‌లో ఓలా క్యాబ్స్‌ను కూడా ట్యాగ్ చేసింది. ‘‘నా ఇల్లుగా భావించే ఈ నగరంలో ఈ రోజు నాకు భద్రత లేదనే భావన కలిగించింది. ఇంటికి వెళ్లేందుకు నేను ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నా. అతడు కారు నడుపుతూనే హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. నేను అతడిని గమనించడం లేదని అతడు అనుకున్నాడు. నేను చూస్తున్నా అని తెలియగానే దోతిని క్లోజ్ చేశాడు. తాను చేసింది తప్పేమీ కాదన్నట్లు ప్రవర్తించాడు. కాస్త ధైర్యం తెచ్చుకుని నేను క్యాబ్ ఆపమని అరిచాను. చీకటిగా ఉన్న రోడ్డుపైనే దిగిపోయాను. ఆ తర్వాత అతడు వెళ్లిపోయాడు. చివరిగా నేను మరో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయాను’’ అని పేర్కొంది.
Also Read: మీ రక్తంలో చక్కెర ఉందా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.. డయాబెటిక్స్‌కు బ్యాడ్ న్యూస్!
స్పందించిన ఓలా..: తన ఫిర్యాదుపై బెంగళూరు ఓలా స్పందించిందని ఆమె మరో ట్వీట్లో పేర్కొంది. ‘‘ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా అతడిపై ఫిర్యాదు నమోదు చేశానని ఓలా తెలిపింది. కానీ, ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు సురక్షితంగా ఇంటికి ఎలా వెళ్లగలం? వారి కోసం మనం పనులు మానుకోవాలా? ఈ రోజు నేను నివసిస్తున్న నా నగరంలో బహిరంగంగానే హస్తప్రయోగం చేసుకుంటున్న ఘటన నన్ను చాలా భయపెట్టింది. ఇలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నామా అనిపించింది’’ అని తెలిపింది.
Read also: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది