ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’లో వచ్చే వెబ్ సీరిస్‌లను ఒక్కసారి చూడటం అలవాటు చేసుకుంటే.. అదే వ్యసనంగా మారుతుంది. ఎందుకంటే.. కొన్ని థ్రిల్లింగ్ వెబ్ సీరిస్‌లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. అవి ఎన్ని ఎపిసోడ్లు నడిచినా బోరు కొట్టావు. ప్రేక్షకులు కూడా ‘We Want More’ అంటూ.. కొత్త సీజన్ల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అలాంటి వెబ్ సీరిస్‌ల్లో ఒకటి.. ‘Squid Game’. స్పానిష్ వెబ్ సీరిస్ ‘Money Heist
’ను మించి ప్రేక్షకాధరణ పొందిన కొరియా వెబ్ సీరిస్ ‘Squid Game’ (స్క్విడ్ గేమ్) ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్, కొరియా భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది.


ఈ వెబ్ సీరిస్‌కు వస్తున్న ఆధరణ దృష్టిలో పెట్టుకుని ‘నెట్ ఫ్లిక్స్’ దక్షిణాది ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. శనివారం ట్విట్టర్‌లో ఓ ఫొటోను ట్వీట్ చేసింది. దాన్ని జూమ్ చేస్తే మీరు ఒక గుడ్ న్యూస్ చూడవచ్చని తెలిపింది. మీకు కూడా ఆ గుడ్ న్యూస్ చూడాలంటే.. ఈ కింది ట్వీట్లోని ఫొటోను జూమ్ చేసి చూడండి. 






చూశారా.. ఇకపై Squid Game తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. దీంతో స్క్విడ్ గేమ్ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనుంది. అయితే, దీనిపై కన్నడ, మలయాళం ప్రేక్షకుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. మీరు తెలుగు, తమిళ భాషలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ భాషలను విస్మరిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. దక్షిణాది భాషలంటే కేవలం తెలుగు, తమిళమే కాదని తమని కూడా గుర్తించండని అంటున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ వారి కోరిక కూడా తీర్చుతుందో లేదో చూడాలి. మీరు మాత్రం ఇక తెలుగులో ‘స్క్విడ్ గేమ్’ను ఎంజాయ్ చేయండి.


Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!

 


Also Read: అరె ఏంట్రా ఇది.. సిరి చేతిలో షణ్ముఖ్ భవిష్యత్? టైటిల్ రేసులో సన్నీ!


Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: ర‌జ‌నీకాంత్‌తో వరుస సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడితో విక్ర‌మ్‌.. ద‌ళిత్ సినిమా క‌న్ఫ‌ర్మ్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి