కరోనా వైరస్ ప్రపంచంలో లక్షల మంది ప్రాణాలు తీసింది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు బతికి బయటపడ్డారు. కానీ వారిలో కోట్ల మంది ఇప్పటికీ లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు ఓ సర్వే తేల్చింది. ఇది ఇప్పుడు తీవ్రమైన లాంగ్ కోవిడ్ లక్షణాలు గత రెండు మూడేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉండడం కలవరపెడుతోంది. డిసెంబర్ 2021లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీర్ఘకాల కోవిడ్‌ను పోస్ట్ కోవిడ్-19 స్థితిగా గుర్తించింది. ఇది కూడా ఒక అనారోగ్యంగానే గుర్తించింది. ఎవరైతే లాంగ్ కోవిడ్ బారిన పడ్డారో వారు వైద్యులసు సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. లేకుంటే ఇతర అనారోగ్యాలు కూడా కలిగి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. 


లక్షణాలు
కరోనా వైరస్ బారిన పడ్డాక కొన్ని రోజులకు నెగిటివ్ ఫలితం వస్తుంది. కానీ వారి నుంచి లక్షణాలు మాత్రం పోవు. అలసట, ఊపిరి ఆడకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం, నిద్ర సమస్యలు, నిరంతర దగ్గు, ఛాతీ నొప్పి, మాట్లాడడంలో ఇబ్బంది, కండరాల నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, డిప్రెషన్ రావడం , ఆందోళనచ జ్వరం వంటి అనేక రకాల ప్రభావాలు కనిపిస్తాయి.  కోవిడ్-19 అనంతర పరిస్థితుల్లో భాగంగా కొంతమంది మానసిక  సమస్యలను ఎదుర్కొంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కోవిడ్ వచ్చిన పదిరోజుల తరువాత  నెగిటివ్ ఫలితం రాగానే తగ్గిపోయిందని అనుకుంటారు చాలా మంది. కానీ కొందరిలో అది దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. 


కరోనా వైరస్ బారిన పడి తేరుకున్న వారిలో దాదాపు 10 నుంచి 20 శాతం మంది దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు ఒక పరిశోధన తేల్చింది. ఒక నివేదిక ప్రకారం ప్రస్తుతం 144 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్నారు.యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఇటీవలి అధ్యయనం ప్రకారం, చిత్త వైకల్యం, మెదడు పనితీరులో సమస్యలు, మూర్ఛ వంటివి కూడా లాంగ్ కోవిడ్ రోగుల్లో కనిపిస్తున్నాయి. కోవిడ్ సోకాక రెండేళ్ల తరువాత ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. దాదాపు 1.25 మిలియన్ల మందిపై ఈ అధ్యయనం  సాగింది.  రోగులను రెండేళ్ల పాటూ పరిశీలించారు అధ్యయనకర్తలు. 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయని అధ్యయనం కనుగొంది.


కరోనా వేరియంట్లలో అన్నింటి కన్నా ఒమిక్రాన్ సోకిన వారిలో మానసిక సమస్యలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు పరిశోధకులు. నిజానికి డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువే. కానీ ఇది సోకిన వారిలోనే మానసికపరమైన సమస్యలు కనిపిస్తున్నాయి. 


Also read: పదహారు పిల్లల తల్లి, ఆమె జీవితంలో 14 ఏళ్లు గర్భవతే


Also read: పెళ్లి అయినట్టు కల వస్తోందా? దానర్థం ఇదే


































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.