పెళ్లి చేసుకోవాలని, జీవితంలో సెటిల్ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు. కొందరికి అప్పుడప్పుడు పెళ్లికి సంబంధించి కలలు వస్తుంటాయి. కలలు కంటున్నప్పుడు మెదడులో, మనసులో చాలా దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కల వచ్చిదంటే ఎందుకు వచ్చిందో తెలియక చాలా మంది తికమకపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లయిన వాళ్లకు కూడా మళ్లీ పెళ్లి అయినట్టు కలలు వస్తాయి. అవి వారి మనసులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే పెళ్లికి సంబంధించిన కలలను డీకోడ్ చేశారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. వీటి అర్థం ఏమిటో మీరూ తెలుసుకోండి. 


1. అవివాహితులకు పెళ్లి అయినట్టు కల వస్తే దానర్ధం మీకు ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని అర్థం. అది పెళ్లి కావచ్చు, ఉద్యోగపరమైనది కావచ్చు, వ్యాపారపరమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు. జీవితంలో ఓ ప్రధాన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని కూడా అర్థం. 


2. ప్రేమలో ఉన్న వారికి పెళ్లయినట్టు కల వస్తే దాని సంకేతం వేరు. ఈ కల మీ బంధం బలంగా ముందుకు సాగుతుందని చెప్పకనే చెబుతోంది. మీరు ఇద్దరూ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నట్టు లెక్క. ఈ కల వస్తే మీ భాగస్వామితో చర్చించడం అవసరం. మీరిద్దరి బంధాన్ని ఈ కల మరింత బలోపేతం చేస్తుంది. 


3. వివాహ సన్నాహాలు జరుగుతున్నట్టు కల వస్తే కాస్త ఆలోచించాల్సిన విషయమే. మీ జీవితంలో జరుగుతున్న ఏదో ఒక విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. వివాహానికి సిద్ధమవడం ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకే ఈ కల వస్తే అది పూర్తిగా ఒత్తిడికి సంబంధించినది అని అర్థం. మీకు మానసిక ఆందోళన కూడా  మొదలయ్యే అవకాశం ఉంది. 


4. మీకు పెళ్లి అయి భార్య లేదా భర్త ఉన్నాక, లేదా ప్రేమికురాలు/ప్రేమికుడు ఉన్నాక కూడా వేరొకరిని వివాహం చేసుకున్నట్టు కల వస్తే దీనర్ధం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అంటే మీరు మీ జీవితభాగస్వామి విషయంలో ఏదో అసంతృప్తితో ఉన్నారని అర్థం. ఆమె/అతడు నుంచి మీరు మరింత ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటున్నారని అర్థం. అంతే కానీ రెండో పెళ్లి చేసుకోమని మాత్రం అర్థం కాదు. 


5. ఇతరులకు అంటే మీ స్నేహితులకు లేదా తెలిసిన వారికి పెళ్లి జరిగినట్టు కల వస్తే దానర్థం మీరు కుటుంబంలో లేదా,స్నేహితులతో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం. మీరు కాస్త జీవితంపై శ్రద్ధ వహించి ఆ సమస్యేంటో తెలుసుకుని ముందుకు సాగాలి. 


6. పెళ్లికి సంబంధించి కలలు రాగానే కొంతమంది ఆనందిస్తారు, కానీ కొంతమంది ఒత్తిడికి, గందరగోళానికి గురవుతారు. అలా కావద్దు. జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు ముందుగానే మిమ్మల్ని కలలు హెచ్చరిస్తున్నాయనుకోండి. ప్రతిది పాజిటివ్ గా తీసుకోండి. 


Also read: క్లియోపాత్రా అందం రహస్యం ఇదే, ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే


Also read: గర్భనిరోధక మాత్రల వల్ల భవిష్యత్తులో గర్భస్రావం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయా? ఏది అపోహ, ఏది నిజం?