Impact of Education on Family Planning : పాత ధోరణులు మారడంతో పాటు.. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత అంశాలపై ఎక్కువమంది దృష్టి పెడుతున్నారు. మగవారితో పాటు.. ఆడవారు కూడా వ్యక్తిగత లక్ష్యాలు, కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోర్గాన్ స్టాన్లీ స్టడీ చేసింది. దీనిలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. 2030 నాటికి 25 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో 45 శాతం మంది సింగిల్‌గా, పిల్లలు కూడా లేకుండా ఉంటారని అంచనా వేసి.. అందరినీ విస్మయానికి గురిచేసింది.
అప్పటికంటే పెరిగింది..
గతంలో కంటే ఈ పర్సెంట్ కాస్త పెరిగింది. 2018లో ఆ వయసులో సింగిల్‌గా ఉన్నవారి సంఖ్య 41 శాతంగా ఉంది. పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం కంటే తమ కెరీర్లు, వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెడుతున్నారని అధ్యయనం తెలిపింది. విద్య, వృత్తి అవకాశాలు కూడా వారికి మంచి కెరీర్‌ను మలచుకునేందుకు సహాయం చేస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా సామాజిక నిబంధనలు, అంచనాలతో సహా వివిధ కారణాల వల్ల మహిళలు ఈ నిర్ణయాన్ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారు.
షాకింగ్ విషయాలు..
గతంలో మాదిరిగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడంలేదు. వివిధ కారణాల వల్ల పిల్లలు పుట్టడం కూడా ఆలస్యమవుతుంది. లేదంటే కొందరు పిల్లలనే వద్దు అనుకుంటున్నారు. ఈ వయసులోపే పిల్లల్ని కనాలనే ఒత్తిడిని తీసుకునేందుకు ఇష్టపడట్లేదు. సెల్ఫ్ని ముందు పెట్టి.. కెరీర్లో సక్సెస్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అధ్యయనం షాకింగ్ విషయాలు తెలిపింది.
యాంగ్జైటీ కూడా ఓ కారణమే
సోలో ట్రావెల్, నైట్ లైఫ్, ఫుడ్, స్కిన్ కేర్, బ్యూటీ, రిటైల్ షాపింగ్ పేరుతో సింగిల్ మహిళలు.. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసేవారికంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది ఈ లైఫ్‌స్టైల్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని కొందరి వాదన. అవివాహిత, సంతానం లేని మహిళల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం వంటి వాటితో ఎక్కువగా పోరాడాల్సి వస్తుందని సర్వే తేల్చి చెప్పింది. ఓ రకంగా యాంగ్జైటీ వంటి కాంప్లెక్షన్స్ కూడా ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయని తెలిపింది.
Dink కల్చర్ కూడా కారణమే..
ఒకప్పటిలాగా ఆడవాళ్లు వంటింటికి, పిల్లలకే పరిమితంగానే ఉండేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పుటు తమ జీవితాన్ని వారు అనుభవించడం నేర్చుకుంటున్నారు. తమ శక్తి, యుక్తులను కెరీర్ గ్రోత్ కోసం వాడుకుంటున్నారు. పురుషుల మాదిరిగానే.. మహిళలు కూడా అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటూ.. తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. గతంలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే వివాహం చేసుకునేవారు. ఇప్పుడు ప్రాధాన్యతలు మారుతున్నాయి. పైగా పిల్లలు లేకపోవడమనేది DINK కల్చర్‌లో కూడా భాగమవుతుంది. అందుకే దాదాపు సగం మంది యువతులు వచ్చే ఆరేళ్లల్లో సింగిల్‌గా, పిల్లలు లేకుండా ఉంటున్నారని సర్వే తెలిపింది.
Also Read : భారత్‌లోనూ పెరిగిపోతున్న DINK కల్చర్.. పిల్లలు వద్దు, ఆదాయమే ముద్దు అంటోన్న కపుల్స్
విడాకులు కూడా పెరుగుతున్నాయి
సామాజిక, ఆర్థిక కారణాల వల్ల జరిగిన ఈ మార్పు.. ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన మార్పులు తీసుకురానుంది. పెళ్లి చేసుకోకుండా ఉండే ట్రెండ్ పెరుగుతోంది. మగవారిలో కూడా ఈ ఆలోచన ఉంది. అలాగే మహిళల్లో కూడా ఇది పెరుగుతుంది. అందుకే సింగిల్ ఉమెన్స్ సంఖ్య పెరుగుతోంది. అలాగే చిన్నవయసులో పెళ్లి చేసుకున్న మహిళలు విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా పెరిగిపోతున్నాయని, అలాగే పెళ్లి చేసుకోకూడదనే స్వతహాగా నిర్ణయం తీసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. దీనివల్ల భవిష్యత్తులో మహిళల జీవనశైలిలో, కుటుంబాలపై గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని నిపుణులు చెప్తున్నారు.
Also Read : 15 ఏళ్ల కిడ్స్‌లో పెరుగుతోన్న లైంగిక సమస్యలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO.. కారణమిదే