Jr. NTR and Ram Charan Meet With Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సమావేశం కానున్నారు. తుపాను బాధితులకు ప్రకటించిన విరాళాన్ని నేరుగా సీఎంకు అందజేయనున్నారు. ఈ మధ్య వరదలు ఉప్పొంగి విజయవాడను ముంచెత్తాయి. దాదాపు పది రోజుల పాటు బెజవాడ వరద నీటిలో ఉండి ఇబ్బందులు పడింది. దీంతో వారికి సాయంగా చాలా మంది ప్రముఖులు ముందుకొచ్చి సాయం ప్రకటించారు. అలా రామ్‌చరణ్, ఎన్టీఆర్ కూడా సాయం ప్రకటించారు. ఆ చెక్‌ను నేరుగా చంద్రబాబుతో సమావేశమై ఇవ్వబోతున్నారు. 


టీడీపీ, ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది. పార్టీకి, ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు కలుసుకున్నది చాలా తక్కువ. అలాంటి సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ మాట్లాడుకున్నది కూడా అరుద. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో ఎన్టీఆర్ సమావేశమంటే చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు అరెస్టు టైంలో కూడా స్పందించలేదని, ఆయన ఫ్యామిలీపై మాటల దాడి చేసినప్పుడు అండగా నిలబడలేదని జూనియర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.


ఎన్నికల టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్‌ను ఏపీ సహా దేశవ్యాప్త ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎవరికి మద్దతు ఇవ్వాలో తన తమ్ముడితో మాట్లాడి చెబుతానన్నారు. అది కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. 


మొన్నీ మధ్య జరిగిన బాలకృష్ణ ప్రోగ్రామ్‌కి కూడా పిలుపు లేకపోవడంతో విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. ఈ మధ్యకాలంలో బాబాయ్ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని ప్రకటించిన తర్వాత తనకు శుభాకాంక్షలు చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. ఇప్పుడు సమావేశం అయ్యేది వరద బాధితుల కోసమే అయినా ప్రాధాన్యత సంతరించుకుంది. 



ఈ మధ్య కాలంలో కుండపోత వర్షాలకు విజయవాడ, ఖమ్మం నీట మునిగాయి. దాదాపు రెండు అంతస్తు వలకు నీరు రావడంతో కట్టుబట్టలతోనే ప్రజలంతా మిగిలిపోయారు. వారిని ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ తొలుత స్పందించి ఒక్కో రాష్ట్రానికి యాభై వేలు చొప్పున ప్రకటించారు. ఇప్పుడు సీఎంతో సమావేశమ నేరుగా అందివ్వాలని నిర్ణయించారు. ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశమై యాభై వేలు ఇవ్వనున్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. 


రాణ్‌ చరణ్ కోటి సాయం 
హీరో రామ్‌చరణ్ కూడా రాష్ట్రానికి యాభై లక్షలు చొప్పున ప్రకటించారు. వరద బాధితులకు అండగా నిలవడంలో తన వంతు సాయం చేశారు. ఈ చెక్‌ను సీఎం చంద్రబాబుతో సమావేశమై అందజేయనున్నారు. 


Also Read: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ