Rise of DINK Culture in India : పూర్వం అంటే తాతలనాటి కాలంలో పిల్లలు ఎంతమంది అంటే 8 లేదా 9 అంతకు మించి అనే సంఖ్య వినిపించేది. తర్వాత కుటుంబ నియంత్రణ, జనాభ రేటు అంటూ.. ఇద్దరు పిల్లలు ముద్దు అనే కార్యక్రమం ప్రభావం బాగానే పడింది. తర్వాత అందరూ ముగ్గురు, ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకున్నారు. అనంతరం ఇది ఒకరికి పడిపోయింది. ఇద్దరు కంటే ఒకరు ఉంటే బెస్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దు అనుకుంటున్నారు. దానిని DINK అంటున్నారు. ఇంతకీ ఈ DINK అంటే ఏమిటి? 


ఆ ఆలోచన మారిపోయింది..


పిల్లల కంటే తమ అవసరాలపై దృష్టి సారిస్తూ.. కపుల్స్ తీసుకుంటున్న నిర్ణయమే DINK. DINK-Dual Income No Kids. అంటే ఇద్దరూ తమ అవసరాల కోసం జాబ్స్ చేస్తారు. కానీ పిల్లలు కనడంపై వీరు ఆసక్తి చూపరు. ఉన్న లైఫ్​ని కపుల్స్​గా, ఆర్థికంగా బలపడేందుకు చూస్తారు కానీ.. ఫ్యామిలీ అంటే పిల్లలు, నెక్స్ట్ జెనరేషన్​ అనే థాట్ వారికి ఉండదు. ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ కల్చర్ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చింది. 


తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు


ఎందుకంటే DINK విధానం ఇండియాలో కూడా పెరుగుతోందని తాజా అధ్యయనం తేల్చింది. లాన్సెట్ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో MarketWatch ఈ కల్చర్​పై సర్వే చేసింది. అక్కడ ఈ నిష్పత్తి 86 శాతం ఉండగా..  వారు పిల్లల కంటే జీవిత లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని తేలింది. వీరిలో 40 శాతం మంది ఆర్థికంగా స్ట్రాంగ్​గా ఉండడమే తమకు ముఖ్యమని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈ నిష్పత్తి బాగానే పెరిగింది.  1950లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 6.18 శాతం ఉంటే.. 2021 నాటికి 1.91 శాతానికి ఇది పడిపోయింది. 


ఆర్థికప్రభావం వారిపై గట్టిగానే పడింది..


కరోనా, జాబ్స్ లేకపోవడం వంటి కారణాలు.. మిలీనియల్, Gen Zలపై గట్టిగానే ప్రభావం చూపించాయి. ద్రవ్యోల్బణం , జాబ్ రెషిషన్స్, ఫినాన్షియల్ ఇబ్బందులు, పెరుగుతున్న రేట్లు మొదలగు అంశాలు.. ఆర్థిక ప్రాధాన్యతను తెలియజేశాయి. దీనికి అనుగుణంగా పిల్లలపై తమ దృష్టిని మార్చుకుంటున్నారు. అందుకే పిల్లలు కావాలా వద్దా అనే నిర్ణయం వాళ్లే తీసుకుంటున్నారు. 


ఆ ఫేజ్​ని ఎడిట్​ చేసేస్తున్నారు..


పిల్లలు ఉంటే వారి చదువులు, పోషణ, లగ్జరీ లైఫ్ వంటి అంశాలను తాము ఎఫర్ట్ చేయగలమా? లేదా అనే ఆలోచనలో మిలీనియల్స్, Gen Zలు ఉన్నారు. వారు సంపాదించిన ధనం తమకే సరిపోవట్లేదు కాబట్టి.. పిల్లలు అనే అంశాన్ని వారు ఎడిట్ చేస్తున్నారు. ఉన్నంత కాలం హ్యాపీగా, ఆర్థికంగా స్ట్రాంగ్​గా ఉందాం.. ఇప్పటికి ఉన్న ఒత్తిడి చాలు.. మరింత ఒత్తిడి వద్దు అనుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. 


వ్యతిరేకించేవారు.. స్వాగతించేవారు..


అయితే అమెరికాలో చేసిన ఈ సర్వేలో తేలిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పిల్లలు లేకపోవడం వల్ల దాంపత్య జీవితం మరింత మెరుగ్గా ఉందంటూ వారు తెలిపారు. అయితే ఈ కల్చర్ ఇండియాలో కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో పిల్లల్నే తమ ఆస్తిగా చెప్పేవారు.. ఇప్పుడు పిల్లలు వద్దు సంపాదనే ముద్దు అంటున్నారంటూ సీరియస్ అవుతున్నారు. 



ఈ జెనరేషన్​లో పిల్లల్ని కని పెంచాలంటే ఆర్థికంగా ఎంతో స్ట్రాంగ్​గా ఉండాలి. అలాంటి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఎక్కువమందికి దొరకట్లేదు. కాబట్టి ఈ విధానంతో దంపతులు హ్యాపీగా ఉండొచ్చు అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఇది కాకుండా ఇండియాలో పిల్లలు లేకపోవడం అంటే అదొక దారుణంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఈ కల్చర్ ఎన్నాళ్లు భారత్​లో ఉంటుందో.. ఎన్ని భయంకరమైన మార్పులు తీసుకువస్తుందో.. చూడాలి. 


Also Read : సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న నేటి యువత.. ట్రెండ్ మారిందా? సెట్ చేస్తున్నారా?