The Joy of Being Single : నీకేమి తెలుసురా సింగిల్ గాడివి అంటూ ఫ్రెండ్స్ హేళన చేస్తూ ఉంటారు కానీ.. నిజంగా సింగిల్‌గా ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయట. ఈ మధ్యకాలంలో ఆఫీస్, ఇళ్లు, ఫ్యామిలీ ఇలాంటి ఒత్తిడి ఎక్కువైపోతుంది. వివిధ కారణాలవల్ల చాలామంది స్ట్రెస్‌కి గురవుతున్నారు. అయితే ఈ లిస్ట్‌లో ఎవరైనా కాస్త హ్యాపీగా ఉంటున్నారా అంటే అది కేవలం సింగిల్సే అని చెప్పాలి.
రిలేషన్స్ కష్టాలు..
ఏ రిలేషన్ అయినా కొత్తలో బాగానే ఉంటుంది కానీ.. రోజులు గడిచే కొద్ది వారి ఫ్రీడమ్, ఇండివిడ్యూవాలటీ పోతుంది. ఈ తరహా మైండ్ సెట్ గతంలో పెద్దగా కనిపించేంది కాదు. కానీ ఈ జెనరేషన్లో ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇది లేకపోవడమే అతి పెద్ద ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు. సింగిల్‌గా ఉండే వ్యక్తి ఫ్యామిలీ పర్సన్‌గా మారినప్పుడు ఈ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. దీనివల్లే భార్య భర్తల మధ్య మనస్ఫర్థలకు కారణమవుతుంది. విడిపోయేవారు ఎక్కువయ్యే కొద్ది రిలేషన్స్ మీద యువతలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే వివిధ డేటింగ్స్, సింగిల్స్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
సెల్ఫ్ లవ్
అయితే సింగిల్‌గా ఉండడం వల్ల ఫ్రీడమ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ లవ్ అనేది మొదటి ప్రయారిటీ అవుతుంది. ఆర్థికంగా కూడా కాస్త లిబర్టీ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. ఎవరో కంట్రోల్ చేస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ.. సెల్ఫ్ కంట్రోల్ అనేది కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేస్తుంది. అలాగే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేందుకు టైమ్ దొరుకుతుంది. తమకు ఇష్టమైన పనులు, రుచులు ఆస్వాదించే వీలు ఉంటుంది. అదే ఫ్యామిలీ లైఫ్‌లో ఇవన్నీ ఉండవు అని కాదు కానీ.. కాంప్రిమైజ్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది.
స్టడీ ఏమంటుందంటే..
ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ సింగిల్స్‌పై అధ్యయనం చేసింది. అమెరికాలో దాదాపు 30 శాతం మంది ఒంటరిగా ఉంటున్నారట. 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నవారు వీరిలో సగం ఉన్నారట. 30 నుంచి 49 సంవత్సరాల వయసు వారిలో 20 శాతం మంది ఒంటరిగా ఉన్నారట. ఈ సింగిల్ హుడ్‌ని దాదాపు 79 శాతం మంది స్వాగతిస్తున్నట్లు ఈ స్టడీలో తేలింది.
సంతృప్తిగా జీవిస్తున్నారట..
తమని తాము ఆనందంగా ఉంచుకునేందుకు సోలో ట్రిప్స్‌కి ఎలాంటి బెరుకు లేకుండా వెళ్లగలుగుతున్నారట. ఒంటరిగా ప్రయాణం చేసి.. నచ్చిన ప్రదేశాలు చూస్తున్నారట. స్వీయ సంరక్షణకు ఎక్కువ ప్రాధన్యతను ఇస్తున్నారట. స్నేహాలు, సంబంధాలు పెంచుకుంటున్నట్లు, వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచిలు ఫాలో అవుతున్నట్లు, సౌకర్యవంతమైన, సంతోషకరమైన ఇంటి వాతవరణాన్ని అనుభవిస్తూ సంతృప్తిగా ఉంటున్నారు.
ఒత్తిడి తప్పదు..
సింగిల్స్ ఎంత హ్యాపీగా ఉన్నా.. సామాజిక ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడం మాత్రం కష్టమే. ఎందుకంటే సింగల్‌గా ఉండడాన్ని సమాజం అసమర్థతగా భావిస్తుంది. అలాగే ఒంటరితనం ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తుందో గుర్తు చేసి.. ఒత్తిడి పెంచుతుంది. కొందరు బై ఛాయిస్ సింగిల్‌గా ఉంటారు. మరికొందరు ఇదే ఆప్షన్‌గా తీసుకుని సింగిల్‌గా ఉంటారు. అయితే ఈ లైఫ్ బోర్ కొడుతుందని కాకుండా.. మీ లైఫ్‌లో ఇంకొకరు ఉంటే హ్యాపీగా ఉంటామనుకున్నప్పుడు సింగిల్ లైఫ్‌కి బాయ్ చెప్పేయొచ్చు.
Also Read : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్ లేకుండా ఈ రిలేషన్షిప్ ఏదో బానే ఉందిగా