Mahindra Electric Thar: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహీంద్రా తన కొత్త థార్ రాక్స్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ త్వరలో భారతదేశంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో అనేక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కూడా విడుదల చేయనుందని తెలుస్తోంది. కొంతకాలం క్రితం ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, మహీంద్రా సంస్థల మధ్య ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ థార్ కూడా ఏపీపీ550 అనే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది.


మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ గొప్ప స్టైల్, డిజైన్‌తో మార్కెట్లోకి రానుంది. ఇది ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉంది. అంటే ఈ కారుకు సంబంధించిన కాన్సెప్ట్ మోడల్ ప్రస్తుతానికి రెడీ అయింది. దీని మాస్ ప్రొడక్షన్ మోడల్ కూడా కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుందని సమాచారం. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రోడ్డులో అయినా సరే డ్రైవింగ్ చేయడానికి ఎటువంటి సమస్య ఉండదు. పీ1 పేరుతో కొత్త ఇంగ్లో ఈవీ ప్లాట్‌ఫారంపై థార్ ఎలక్ట్రిక్ వెర్షన్ తయారు కానుంది.


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి


థార్ ఎలక్ట్రిక్ ఫీచర్లు ఇవే...
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్‌లో బీవైడీ, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీల బ్యాటరీలను ఉపయోగించవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ బ్యాటరీ 80 కేడబ్ల్యూహెచ్-ఆర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జ్‌కు దాదాపు 450 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. థార్ కాకుండా మహీంద్రా మరో ఐదు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేయబోతోంది. థార్ ఎలక్ట్రిక్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ అయ్యాక దీని ధర రూ. 18 నుంచి 20 లక్షల మధ్యలో ఉండవచ్చు.


మహీంద్రా కొత్త ఎస్‌యూవీ థార్ రాక్స్‌ను స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు 14వ తేదీ రాత్రి విడుదల చేసింది. ఈ ఐదు డోర్ల ఎస్‌యూవీ కోసం కంపెనీ బుకింగ్ తేదీని కూడా ఖరారు చేసింది. అక్టోబర్ నెల నుంచి థార్ రాక్స్ బుకింగ్‌లను మహీంద్రా ప్రారంభించనుంది. కారు డెలివరీలను కూడా అప్పుడే ప్రారంభించేలా కంపెనీ ప్లాన్ చేసింది. మహీంద్రా థార్ రాక్స్‌లో పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. డీజిల్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ఎక్స్ షోరూం ధరలు. ఆన్ రోడ్‌కు వచ్చేసరికి వీటి ధర మరింత పెరుగుతుంది.






Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్