Heavy Rains In Hyderabad:హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాలాలు పొంగి... మహానగరంలోని రోడ్లను చెరువులుగా మార్చాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. మొన్న (ఆదివారం) రాత్రి కుండపోత కురిసింది... సోమవారం ఉదయానికి వర్షం తగ్గినట్టే తగ్గి... భారీ దంచికొట్టింది. దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి... హైదరాబాద్ అల్లకల్లోలమైంది. ప్రధాన మార్గాలన్నీ... వరద నీటితో నిండిపోయాయి. దీంతో... వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.
కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ
భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కుప్పకూలింది. ఈ దెబ్బకు పార్కింగ్ చేసిన వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
షేక్‌పేట్ మార్గం... ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద.. ఇరువైపులా వరద నీరు చేరడంతో.. ఆ మార్గాలు మూసేశారు. వేరే దారి లేక.. ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లిన వాహనదారులు.. కొన్ని గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. దాదాపు మూడు గంటలపాటు ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. బైక్‌లు, కార్లు.. వరద నీటిలో కొట్టుకుపోయాయి. షేక్‌పేట్‌లో మాత్రమే కాదు.. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపించింది. యూసుఫ్‌గూడను కూడా వర్షపు నీరు ముంచెత్తింది. ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంకా వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో... ట్రాఫిక్ పోలీసులు... ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ప్రత్నామ్యాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు.
మా మార్గాల్లో వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త...!
హైదరాబాద్‌లోని NMDC సమీపంలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. అటువైపు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు ఆసిఫనగర్ పోలీసులు, DRF సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గచ్చిబౌలి మార్గంలో కూడా ట్రాఫిక్ నెమ్మదిగానే కదులుతోంది. చాంద్రాయణగుట్ట నుండి అరమ్‌ఘర్ ఎయిర్‌పోర్ట్రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక... లింగంపల్లి సర్కిల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి... దీంతో రోడ్లకు గుంతలు పడ్డాయి. వర్షాలకు... గుంతలు నీటితో నిండిపోవడంతో... ట్రాఫిక్ మరీ నెమ్మదిగా కదులుతోంది. ఇక... బండ్లగూడ నుంచి ముషీరాబాద్ వరకు కూడా రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉంది. రెస్టారెంట్లలోకి నీరు వర్షాపు నీరు చేరింది. దీంతో... నీటి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలా.. చాలా మార్గాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో... ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. లంగర్‌హౌస్ ప్రాంతాల్లో రోడ్డు 90 శాతంలో నిండిపోయింది. ఈ పరిస్థితి... ఎప్పుడూ చూడలేదని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల కారణంగా రోడ్లు జారుడుగా ఉండవచ్చని, నీరు నిలవడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడవచ్చని పోలీసులు చెప్తున్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి... రోజు కంటే ముందే బయలుదేరాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. GHMC పరిధిలో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అయితే.. కాలేజీ, ఆఫీసులకు మాత్రం సెలవు లేదు. కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు.. అప్రమత్తంగా ఉండాలి.
GHMC అధికారులు మాత్రం.. ఇవాళ వీలైనంత వరకు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వర్షం కారణంగా... ఆఫీసులకు వెళ్లాల్సిన వారు... బయటకు రాకుండా ఉండటం జరగదు. కనుక... జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాహనాలను వేగంగా నడపకూడదు. నీరు నిలిచిన ప్రాంతాల నుంచి కాకుండా... వేరే మార్గాలను చూసుకుంటే బెటర్. కొత్త పాటి నీరు నిలిచిఉన్న ప్రాంతాల వైపు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే... రోడ్లపై గుంతలు ఉండొచ్చు. నీటితో నిండిపోవడం వల్ల గుంతలు కనిపించవు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో... చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కరెంట్ స్తంభాలకు దగ్గరగా వెళ్లడం కూడా మంచిది కాదు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉండటంతో.. జాగ్రత్తలు తీసుకోవాలి ఉందని అధికారులు కూడా సూచిస్తున్నారు.
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన...
హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కూడా... తెలంగాణ వ్యాప్తంగా కుండపోతు వర్షం కురుస్తుందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని... వరద నీరు వచ్చే ప్రాంతాల్లో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని.. ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.