Telangana News: మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం అధికంగా ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ సీఎన్జీ వాహనాల వినియోగం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాలు తగ్గించి ఎలక్ట్రిక్ ,సిఎన్జి వాహనాలను వాడాలని నిర్ణయించింది కేంద్రం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఎన్నో ప్రచారాలు కూడా నిర్వహించారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.


అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కడ చూసినా పొల్యూషన్ ప్రాబ్లం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో టు అండ్ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వాడడం కాకుండా టిఎస్ఆర్టిసి కూడా పర్యావరణ పరిరక్షించేందుకు పాలు పంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ ఎలక్ట్రిక్ వాహన వినియోగాలకు రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాదులో సిటీ అంతట ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాలు ప్రారంభించారు.


కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా  తెలంగాణ రాష్ట్ర మంతటా అన్ని జిల్లాలలో ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద బస్ స్టాండ్ అయినటువంటి కరీంనగర్ జిల్లాని ఎంచుకున్నారు. అయితే మొదటగా కరీంనగర్ రీజియన్ భాగంగా 70 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఈ 70 ఎలక్ట్రిక్ బస్సులన్నీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల్, కామారెడ్డి, మంతిని, గోదావరిఖని వైపు ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు.


ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలోని డిపోలో 70 బస్సులు అన్నింటిని అధికారుల పర్యవేక్షణలో జేబీఎం కంపెనీ టెక్నీషియన్స్ ఎలాంటి సాంకేతికత లోపాలు తలెత్తకుండా ఎలక్ట్రిక్ బస్సులను ట్రయల్ రన్ డిపోలో నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు తిరుగుతాయని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీలో నడిపించబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు జేబీఎం కంపెనీ వారితో అనుసంధానం అయ్యి ప్రతిపాదన రూపంలో నడుపునున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని విధాల నాణ్యతపరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు.


మొత్తానికి అయితే తెలంగాణ ఆర్టీసీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఓవైపు పెట్రోల్ డీజిల్ బాదుడుకు కొంతవరకు ఆర్టీసీ సంస్థకి ఆదా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ బస్సుల వాహనాలు వినియోగం పర్యావరణ పరిరక్షణ కూడా కాపాడేందుకు ఇదొక ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు.