ఆపిల్ తినడానికి ఎవరూ భయపడరు. దానితో బరువు పెరుగుతామనే భయం ఉండదు. అందుకే ఆపిల్ పండ్లు ఎన్ని తినమన్నా తినేస్తారు, కానీ గుడ్డు తినమంటే మాత్రం చాలా మంది ఆలోచిస్తారు. గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని వారి భయం. కానీ కొన్ని అంశాల్లో శరీరానికి ఆపిల్ కన్నా గుడ్డే ఎక్కువ మేలు చేస్తుంది. కెనడాకు చెందిన అల్ బెర్టా యూనివర్సిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పోలిస్తే గుడ్డులో రెండు రెట్లు అధికంగా ఉంటాయి. ఆంటీ యాక్సిడెంట్లు మనకు శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. ఈ ఫ్రీరాడికల్స్ వల్లే ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. కనుక రోజూ గుడ్డు తింటే గుండెకు, రోగనిరోధక శక్తికి కూడా చాలా మంచిది. 


కాకపోతే గుడ్డును పచ్చిగా తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దానికి ఉడికించడం, వేయించడం వల్ల వాటి సంఖ్య సగానికి పడిపోతుంది. అయినా సరే గుడ్డు తినడం వల్ల లాభమే. గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ కూడా హానికరమైనది కాదు. రోజూ తినే ఆహారంలో గుడ్డును కూడా భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్ ఏ,డి,బి12, లుటిన్, జియజాంతన్లు అదనంగా లభిస్తాయి. రోజు గుడ్డు తినేవారిలో కంటి సమస్యలు దరి చేరవు. రోజూ గుడ్డు తినడం వీలు కాని వారు, ఇష్టం లేని వారు కనీసం వారానికి మూడు సార్లు తినమని సూచిస్తున్నారు. 


కొలెస్ట్రాల్ ఉంటుందా?
గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ శరీరం అమాంతం బరువు పెరిగే అవకాశం ఉండదు. పరిశోధన ప్రకారం 58 గ్రాముల బరువుండే ఒక గుడ్డులో కేవలం 4.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది కూడా శరీరంలో చేరడం ఇష్టంలేని వారు, శారీరక శ్రమతో కరిగించుకోవచ్చు. కేవలం ఈ కొవ్వు కోసం గుడ్డుని దూరం పెట్టవద్దని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు. 


Also read: మీరు కొన్న కారం మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోవచ్చు..


Also read: గొర్రెల కాపరి కనిపెట్టిన కాఫీ.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తోంది


Also read: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... హార్వర్డ్ ఆరోగ్య నిపుణుల సలహా


Also read: సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న అలనాటి అందాల నటి భాగ్యశ్రీ


Also read: సోకులారబోస్తున్న సొట్ట బుగ్గల సుందరి... హాట్ ఫోజులతో లావణ్య ఫోటో షూట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి