Bathukamma Flowers Benefits : తెలంగాణలో జరుపుకునే పండుగలలో బతుకమ్మ(Bathukamma 2024)కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహిళలంతా గౌరమ్మను పూజిస్తూ పూలతో బతుకమ్మను చేస్తారు. అయితే బతుకమ్మ సమయంలో ఉపయోగించే పూలతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? అందుకే ఇలా వినియోగించిన పూలను నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే ఈ పూలల్లోని ఔషధ విలువలు నీళ్లలో చేరుతాయి. ఆ నీటిని వినియోగించినవారికి ఔషధ విలువలు అంది.. పలు వ్యాధులు దూరమవుతాయని చెప్తారు. అయితే ఏయే పూలలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


గూనుగు పూలు 


ఇవి రక్తస్రావ నివారిణిగా పనిచేస్తాయి. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గర్భాశయ రక్తస్రావం, బ్లీడింగ్, ల్యూకోరియా, డయేరియా చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు. అధికరక్తపోటు.. కళ్లలో రక్తం కారడం, చూపు మసకబారడం, కంటిలో ఏర్పడే శుక్లాల చికిత్సలో వీటిని వినియోగిస్తారు. అయితే గ్లకోమా ఉన్నవారు దీనిని వినియోగించకపోవడమే మంచిది. 


తంగేడు పూలు


తంగేడు పూలు, ఆకులు, బెరడులో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. ఇవి ఆంత్రాక్వినోన్​లను ఉత్పత్తి చేస్తాయి. జ్వరాలు, మధుమేహం, మూత్ర సంబంధిత వ్యాధులు, మలబద్ధకం వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది భేదిమందు లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. మధుమేహమున్నవారు ఎండిన పూలతో టీ చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇది స్కిన్​ టోన్​ని కూడా మెరుగుపరుస్తుంది. 


పట్టుకుచ్చులు


పట్టుకుచ్చు కాండం, ఆకులను గాయలను తగ్గించడం కోసం వినియోగిస్తారు. పుండ్లు, గాయాలు, చర్మ సంబంధ వ్యాధులు దీనితో నయమవుతాయి. ఈ పూలను తేనేలో కలిపి గాయమైన చోట అప్లై చేస్తే మంట తగ్గి ఉపశమనం అందుతుంది. జీర్ణసమస్యలు దూరమవుతాయి. జ్వరం, కాలేయ సమస్యలు తగ్గుతాయి. దీనిని పాము విషానికి విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు. కామెర్లు, గొనెరియా, తామరను ఇది కంట్రోల్ చేస్తుంది.


గడ్డిపూలు


దీనిని మూలికా వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అపానవాయువు వల్ల కలిగే అసౌకర్యాన్ని ఇది దూరం చేస్తుంది. దానికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. ఆకలిని పెంచి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. దీనితో చేసే నూనె మంచి సువాసనను అందిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి. దగ్గు, విరేచనాలు వంటి సమస్యలు దూరమవుతాయి.



చామంతి


చామంతి పూలతో చేసుకునే టీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇవి శరీరానికి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడమే కాకుండా.. మొటిమలు తగ్గించుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఈ టీ గొంతు నొప్పిని దూరం చేసి.. సమస్య రాకుండా గొంతు నొప్పిని తగ్గిస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. 


గుమ్మడి పువ్వు


గుమ్మడి పువ్వును బతుకమ్మ పేరికలో ప్రధానమైనదిగా చెప్తారు. ఇవి మూత్ర విసర్జన, నరాల బలహీనత వంటి దూరమవుతాయి. గుమ్మడికాయ మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. వాటి పూలు కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. 


మందార పువ్వు


మందారపూలు రుతుక్రమంలో వచ్చే సమస్యలను దూరం చేస్తాయి.  రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. తలనొప్పితగ్గుతుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో కషాయం చేసుకుని తాగితే ఆర్థ్రైటిస్, దగ్గు తగ్గుతాయి. ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. 


నందివర్థనం


ఇవి కంటి వ్యాధుల చికిత్సలో మంచి ప్రయోజనాలు అందిస్తాయి. గాయలను తగ్గిస్తాయి. ఈ పూలరసాన్ని నూనెలో కలిపి చర్మవ్యాధులపై అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. హై బీపీ, మూత్ర సమస్యలు, పంటి నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వీటి వేర్లను కషాయం చేసుకుని తాగితే కడుపులో పురుగులు తగ్గుతాయి. 


కనకాబంరాలు 


కనకాంబరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియాల్, యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. 


బంతి పూలు 


వీటిలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయాల్, ఆస్ట్రింజెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి ఇమ్యూనిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. కండ్లకలక, గాయాలు, కోతలు, పగుళ్లు వంటివాటికి చికిత్సగా ఉపయోగించుకోవచ్చు. ఈస్ట్ ఇన్​ఫెక్షన్లు, డైపర్ వల్ల కలిగే దద్దుర్లను ఇవి దూరం చేస్తాయి. 


ఇవేకాకుండా చల్లగుత్తి, కట్ల, బీరపూలు, చిట్టిచామంతులు, మల్లె, లిల్లీ, గన్నేరు, గులాబీ వంటి పూలు ఎన్నో ఔషదగుణాలు అందుతాయి. అవన్నీ కూడా వివిధ రూపాల్లో ప్రజలకు మేలు చేస్తాయనే ఉద్దేశంతోనే ఈ పండుగను జరుపుకుంటారని కొందరు చెప్తారు. ఈ కాలంలో వైరస్​లు, అంటువ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎదుర్కోవడానికి కూడా ఈ పండుగను చేసుకుంటారని చెప్తారు.


Also Read : బతుకమ్మను ఏ విధంగా పేర్చాలో తెలుసా? ఉపయోగించాల్సిన పూలు ఇవే