కొన్ని విషయాలు నమ్మశక్యంగా ఉండవు, కానీ నమ్మాలి తప్పదు. అలాంటిదే ఈ నీళ్ల బాటిల్ ధర. ఈ బాటిల్‌లో కనీసం లీటర్ నీళ్లు కూడా పట్టవు. 750ఎమ్ఎల్ నీళ్ల బాటిల్ ఇది. ఖరీదు చెప్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం. అక్షరాలా రూ.44 లక్షల రూపాయలు ఈ బాటిల్ ధర. దీని పేరు ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని’ (Acqua di Cristallo Tributo a Modigliani). నీళ్లు తాగేసి బాటిల్ పడేయకండి. ఆ బాటిల్ కూడా బంగారంతో చేసినది. అతి ఖరీదైన బాటిల్‌గా అది 2010లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. మళ్లీ ఇది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. 


నీతా అంబానీ చేతుల్లో..
రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అయినా నీతా అంబానీ క్రికెట్ స్టేడియంలో బంగారు నీళ్ల బాటిల్ పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నీతా ఇంత ఖరీదైన నీళ్లు తాగుతారా అంటూ నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు. అయితే అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. నీతా అంబానీ చేతిలో ఆ బాటిల్ పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.


ఎందుకంత ఖరీదు?
ఈ నీళ్లు, బాటిల్ ఎందుకంత ఖరీదు? అని సందేహం రావచ్చు. ఆ బాటిల్ ను 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ బాటిల్ డిజైన్ చేసింది కూడా సెలెబ్రెటీ బాటిల్ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో.  దీన్ని ఒకటో లేదా రెండో తయారుచేశారు. వాటిని వేలం వేసి మరీ అమ్మారు. తొలిసారి అమ్మినప్పుడు నలభై నాలుగు లక్షల రూపాయలకు కొనుక్కున్నారు. ఆర్డర్ మీద మాత్రమే వీటిని తయారుచేస్తుంటారు. మెక్సికో సిటీలో వీటి వేలం జరుగుతుంటుంది. ఈ వేలంలో వచ్చిన డబ్బులను గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడేందుకు పాటుపడే సంస్థలకు అందిస్తారు. 


నీటి ప్రత్యేకత
ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. వసంతకాలంలో ఫిజి, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి సేకరించే నీరు ఇది. ఈ నీటిలో 5 గ్రాముల 23 క్యారెట్ బంగారాన్ని కూడా కలుపుతారు. ఇది నీళ్లలోనే సెలెబ్రిటీ వాటర్.    


Also Read: ఈ అందమైన ప్రదేశాలలో కొత్త ఏడాదికి స్వాగతం పలకండి... మరిచిపోలేని అనుభూతి ఖాయం
Also Read: గుడ్ న్యూస్... మలేరియాను అడ్డుకునే టీకా వచ్చేసింది, ప్రత్యేకంగా పిల్లల కోసం...
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Also Read: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Also Read: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్‌ కుటుంబానికి మధ్య బంధమేంటి?








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.