సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. సెబి అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంచుంది. జనవరి ఐదు నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. దరఖాస్తులను జనవరి 24 లోపు పంపించాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆఫీసర్ గ్రేడ్-A(అసిస్టెంట్ మేనేజర్) లీగర్ స్ట్రీమ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్ అండ్ అఫిషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో పని చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ స్వీకరణ మొదలైన తేదీ: జనవరి 5
అప్లికేషన్లు స్వీకరించడానికి ఆఖరు తేదీ: జనవరి 24
ఫేజ్I ఆన్‌లైన్ ఎగ్జామ్: ఫిబ్రవరి 20, 2022
ఫేజ్ II ఆన్‌లైన్ ఎగ్జామ్: మార్చి 20, 2022
ఫేజ్ IIలోని రెండో పేపర్ : ఏప్రిల్ 3, 2022
ఖాళీల వివరాలు:
జనరల్ పోస్టులు: 80
లీగల్ ఉద్యోగాలు: 16
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 12 ఉద్యోగాలు
రీసెర్చ్: 7 ఉద్యోగాలు
అఫిషియల్ లాంగ్వేజ్: 3 పోస్టులు
జనరల్ పోస్టుల కోసం అప్లై చేయాలనుకునే వారు "లా"లో డిగ్రీ చేసి ఉండాలి. ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసిన వాళ్లు కూడా అర్హులే.
లీగల్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే "లా"లో డిగ్రీ చేసి ఉండాలి.
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాల కోసం అప్లై చేయాలంటే ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి. లేదంటే ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో పీజీ చేసి ఉండాలి.
రీసెర్చ్ విభాగంలో ఉద్యోగాలకు ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాటస్టిక్స్ ఓ సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ చేసిన వాళ్లు అర్హులు.
అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులకు అప్లై చేయాలంటే హిందీ, ఇంగ్లీష్‌లో డిగ్రీ కానీ, పీజీ కానీ చేసిన వాళ్లు అర్హులు.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ, కర్నూలు, రాజమండ్రి, గుంటూరులో పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వెయ్యిరూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వందల రూపాయల ఫీజు చెల్లించాలి.
Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
Also Read: Railway Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రైల్వే ఉద్యోగాలు.. రెండు వేలకుపైగా ఖాళీలు.
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు