ప్రపంచ వ్యాప్తంగా డిజిటలైజేషన్‌కు ఎక్కువ డిమాండ్‌ పెరుగుతోంది. అన్నింటితో పోలిస్తే ఆర్థిక రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇండియాలోనూ డిజిటల్‌ చెల్లింపులు, స్వీకరణ, డిపాజిట్లు, పెట్టుబడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ డిజిటల్‌ చెల్లింపుల రంగంలో అడుగుపెట్టింది. వాట్సాప్‌ యూపీఐ పేమెంట్లకు బహుమతులు ఇస్తోంది. వాట్సాప్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు ఎలా చేయాలో ఈ మధ్యే ఆ కంపెనీ వివరించింది.


కెమేరా ద్వారా స్కానింగ్‌


ఏదైనా కొనుగోలు చేసినప్పుడు స్థానిక దుకాణాల్లో యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వాట్సాప్‌తో డబ్బులు చెల్లించొచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ ఛాట్‌ కన్నా ముందు కెమేరాపై ట్యాప్‌ చేయాలి. కెమేరా ఐకాన్‌ ఓపెన్‌ అవ్వగానే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దాంతో మీరు డబ్బులు చెల్లించొచ్చు. లావాదేవీ పూర్తవ్వగానే మీ వాట్సాప్‌ కాంటాక్ట్‌కు ఆటోమేటిక్‌గా సందేశం వస్తుంది.


భద్రతకు హామీ


వాట్సాప్‌ చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి భయం అవసరం లేదని కంపెనీ అంటోంది. ఈ ఫీచర్‌ పూర్తిగా సురక్షితమని చెబుతోంది. కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపింది. వాట్సాప్‌ కెమేరా ద్వారా స్కానింగ్‌ చేసి అన్ని స్టెప్స్‌ను అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేస్తోంది.


చెల్లింపుల ప్రక్రియ



  • వాట్సాప్‌కు వెళ్లి కెమేరా ఓపెన్‌ చేయాలి.

  • కెమేరా ఐకాన్‌ ట్యాప్‌ చేసి యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

  • మీ వాట్సాప్‌ నంబర్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానం అయ్యుంటే లావాదేవీ చేయొచ్చు.

  • ఒకేవేళ వాట్సాప్‌కు లింక్‌ చేయకపోతే మొదట అనుసంధానం చేయాలి.


ప్రస్తుతానికి వాట్సాప్‌ను ఎక్కువగా ఛాటింగ్‌, వీడియోలు, ఫోటోలు పంపుకోవడం, వీడియో కాల్స్‌ చేసుకొనేందుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే యూపీఐ పేమెంట్‌ యాప్‌ల్లో వాట్సాప్‌ టాప్‌-10లో లేదు. ఏదేమైనా కస్టమర్లను పెంచుకోవాలని వాట్సాప్‌ పట్టుదలగా ఉంది. ఇప్పటికైతే ఇండియాలో అతిపెద్ద యూపీఐ పేమెంట్స్‌ సంస్థగా ఫోన్‌పే ఉంది.


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!


Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!


Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!