బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన వారు.. బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 15న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న దరఖాస్తుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీల్లోగా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
మొత్తం 2788 పోస్టులకు గానూ ఈ దరఖాస్తులు ఆహ్వానించారు. పురుషులు- 167.5 సెం.మీ, స్త్రీలు- 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ (పురుషులకు మాత్రమే) 78-83 సెం.మీ. గా ఉండాలని.. నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు / తెగలు / గిరిజనులు పురుషులు-162.5 సెం.మీ మరియు స్త్రీ-155 సెం.మీ. ఎత్తు ఉడే సరిపోతుంది. ఛాతీ (పురుషులకు మాత్రమే) 76-81 సెం.మీ ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగి అప్లై చేసుకోవాలనుకునే.. అభ్యర్థులు.. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ.21,700-రూ.69,100 వేతనం పొందుతారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 15 జనవరి 2022 కాగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2022గా ఉంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజు ఉంది. వెనుకబడిన తరగతులకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Schools Closed: జనవరి 31 వరకూ పిల్లలకు సెలవులు.. ఇక ఇల్లు పీకి పందిరేస్తారేమో..
Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు
Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Also Read: Telangana Covid Cases: తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదు.. ముగ్గురు మృతి
Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే