తెలంగాణలో 55,883 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,013 మంది పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.


మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


దేశంలో కరోనా కేసులు



దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,71,202 కేసులు నమోదయ్యాయి. శనివారం కంటే 2,369 కేసులు ఎక్కువగా వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 16.28గా ఉంది. తాజాగా 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.51 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఒక్కరోజులో 314 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 4,86,066కు పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 7,743 కేసులు నమోదయ్యాయి.


వ్యాక్సినేషన్..


భారత్​లో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 42,462 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,64,441కి చేరింది.


కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,730కి చేరింది. ముంబయిలో 11 మంది కరోనాతో మృతి చెందారు. ముంబయిలో కొత్తగా 11 మంది మృతి చెందారు. 


Also Read: Covid Update: ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఒకరు మృతి


Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం