ఏపీలో కొత్తగా 30,002 కరోనా పరీక్షలు చేయగా.. 4,570 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా చిత్తూరులో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 669 మంది కోలుకున్నారు. ప్రస్తుతం.. 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 1,124, విశాఖ-1,028, గుంటూరు-368, అనంతపురం-347, నెల్లూరు-253, తూర్పుగోదావరి జిల్లాలో 233 కేసులు నమోదయ్యాయి.






దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,71,202 కేసులు నమోదయ్యాయి. శనివారం కంటే 2,369 కేసులు ఎక్కువగా వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 16.28గా ఉంది. తాజాగా 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.51 శాతంగా ఉంది.


కరోనా కారణంగా ఒక్కరోజులో 314 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 4,86,066కు పెరిగింది.





మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 7,743 కేసులు నమోదయ్యాయి.




వ్యాక్సినేషన్..


భారత్​లో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 42,462 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,64,441కి చేరింది.


కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,730కి చేరింది. ముంబయిలో 11 మంది కరోనాతో మృతి చెందారు. ముంబయిలో కొత్తగా 11 మంది మృతి చెందారు. 


Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ 


Also Read: Crime News: సగం రేటుకు బంగారం ఇస్తామని ఫోన్ కాల్.. నోట్ల కట్టలతో పొరుగు రాష్ట్రం వెళ్లాక ఊహించని ట్విస్ట్..


Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే