ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు సురేశ్ క్లారిటీ ఇచ్చారు.  సెలవుల పెంచే ఆలోచన లేదని స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయంతో ఏపీలో యథావిధిగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకుంటాయి. గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేశ్.. హాజరయ్యారు. ఈ మేరకు సెలవులపై కామెంట్స్ చేశారు.


ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో పక్క రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.






Also Read: Somu Veerraju: ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు


Also Read: Hyderabad MMTS: 36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.. కారణం ఏంటంటే


Also Read: Crime News: హైదరాబాద్‌‌లో బ్యూటీషియన్ దారుణహత్య.. ప్రియుడితో సహజీవనం, ఆపై ఫ్లాట్‌లో శవమై కనిపించిన యువతి


Also Read: KTR Tweet: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


Also Read: Bhadradri Kothagudem: ఓపెనింగ్‌ ఊరుకోనివ్వదు.. క్లోజింగ్‌ నిద్రపోనివ్వదు.. దీనికి అలవాటు పడితే జీవితాలే నాశనం!


Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి