Goa Elections 2022: గోవా ఎన్నికల బరిలో శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడి పోరు.. సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ

ABP Desam   |  Murali Krishna   |  16 Jan 2022 03:47 PM (IST)

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్‌సీపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. మహారాష్ట్రలో వీరితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. ఒంటరిగా గోవాలో పోటీచేస్తుంది.

గోవా ఎన్నికల్లో ఒంటరిగా కాంగ్రెస్ పోరు

వచ్చే నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. సీట్ల పంపకాలపై ఎన్‌సీపీతో చర్చలు చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్.. గోవా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. 

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్‌సీపీ కలిసి పోటీ చేస్తాయి. సీట్ల పంపకంపై ఈ నెల 18న ఇరు పార్టీల మధ్య సమావేశం ఉంది. ఎన్‌సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్.. ఈ అంశంపై చర్చిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం.                                                    - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ

కాంగ్రెస్‌తో కుదరదు..

40 స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒక్క విడతలోనే జరగనున్నాయి. ఫిబ్రవరి 14న పోలింగ్  జరగనుంది. 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ 17, భాజపా 13 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు 10 స్థానాలు గెలిచారు. 

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి మేం ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కానీ గోవాలో కాంగ్రెస్‌తో సీట్ల పంపకం కుదరదు. కాంగ్రెస్‌ వ్యూహాలు కాంగ్రెస్‌కు ఉంటే. మా వ్యూహాలు మాకు ఉంటాయి. ల్యాండ్ మాఫియా, అవినీతి, డ్రగ్ మాఫియా.. గోవాలో ప్రస్తుతం రాజ్యమేలుతోంది. వీళ్లంతా అక్కడ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలంటే.. మా లాంటి సామాన్యులను గోవా ప్రజలు ఎన్నుకోవాలి.                                             - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ 

Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 16 Jan 2022 03:42 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.