బ్యాంకు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో- ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఉన్న తమ సంస్థ బ్రాంచుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 109 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులలో జనరల్ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, కంపెనీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ నెల 24తో ముగియనుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://www.apmaheshbank.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


విభాగాల వారీగా ఖాళీలు.. 
మేనేజర్/బ్రాంచ్ మేనేజర్ - 41
సీనియర్ మేనేజర్/ హెచ్ఓడీ - 34
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 17
డిప్యూటీ జనరల్ మేనేజర్ - 7
చార్టర్డ్ అకౌంటెంట్ - 5
జనరల్ మేనేజర్ - 3
కంపెనీ సెక్రెటరీ - 1
చీఫ్ రిస్క్ ఆఫీసర్ - 1


విద్యార్హత, వయోపరిమితి.. 
పోస్టులను బట్టి విద్యార్హత వివరాలు మారుతున్నాయి. జనరల్ మేనేజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ/సీఎఫ్ఏ/సీఏ/సీఎస్/ఐసీడబ్ల్యూఏఐ పూర్తి చేసిన వారికి కూడా ప్రాధాన్యం ఇస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. మేనేజర్/బ్రాంచ్ మేనేజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏఐఐబీ విద్యార్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. 


ఇక సీనియర్ మేనేజర్/ హెచ్ఓడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ / పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ/సీఎఫ్ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్/సీఏఐఐబీ విద్యార్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. పైన పేర్కొన్న పోస్టులకు సంబంధిత రంగంతో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది. నోటిఫికేషన్ ప్రకారం.. 40 నుంచి 53 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తులను పంపాలి. దీని కోసం ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వివరాలను అందించారు. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోగా ‘recruit@apmaheshbank.com’ మెయిల్ కు పంపాలి. 


ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాల్సిన చిరునామా..
Dy.General Manager,
A.P.Mahesh Co.op.Urban Bank Ltd., (Multi State Scheduled Bank),
5-3-989, Sherza Estate, N.S.Road, Osmangunj, 
Hyderabad – 500 095(A.P.)


Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..


Also Read: NHPC Recruitment 2021: ఎన్‌హెచ్‌పీసీలో 173 ఉద్యోగాలు.. రూ.1,80,000 వరకు వేతనం..