నేష‌న‌ల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప‌వ‌ర్‌ (NHPC) సంస్థ 173 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్,  సీనియర్ అకౌంటెంట్ ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప‌లు ప్రాంతాల్లో విధులను నిర్వ‌ర్తించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పోస్టుల‌ ద‌ర‌ఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాల కోసం NHPC అధికారిక వెబ్‌సైట్‌ nhpcindia.com వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


పోస్టుల వివరాలు:



  • సీనియర్ మెడికల్ ఆఫీసర్- 13 (కరెంట్ ఇయర్ వేకెన్సీస్.. ఓబీసీ 2, జనరల్ 4; బ్యాక్‌లాగ్ ఖాళీలు.. ఎస్సీ 2, ఓబీసీ 5)

  • జూనియర్ ఇంజనీర్ (సివిల్)- 68 (కరెంట్ ఇయర్ వేకెన్సీస్ జనరల్ 28, ఓబీసీ 19, ఎస్సీ 11, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 6)

  • జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 34 (కరెంట్ ఇయర్ వేకెన్సీస్ జనరల్ 15, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 8; బ్యాక్‌లాగ్ ఖాళీలు.. ఎస్సీ 1)

  • జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)- 31 (కరెంట్ ఇయర్ వేకెన్సీస్ జనరల్ 15, ఓబీసీ 6, ఎస్సీ 5, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 3)

  • అసిస్టెంట్ రాజభాషా ఆఫీసర్ - 7 (బ్యాక్‌లాగ్ ఖాళీలు ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 5)

  • సీనియర్ అకౌంటెంట్- 20 (కరెంట్ ఇయర్ వేకెన్సీస్ జనరల్ 12, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2)


విద్యార్హత, దరఖాస్తు ఫీజు.. 
సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టు రిజిస్ట్రేషన్‌తో పాటు రెండేళ్ల పోస్ట్-ఇంటర్న్‌షిప్ అర్హత కలిగి ఉండాలి. పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీల అభ్యర్థులు రూ .250 ఫీజు చెల్లించాలి. 


వేతనం వివరాలు.. 
సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ. 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ రాజ్‌భాషా అధికారి పోస్టులకు నెలకు రూ .40,000 నుంచి 1,40,000 వరకు వేతనం అందిస్తారు. జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (మెకానికల్), సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు ఎంపికైన వారి జీతం.. నెలకు రూ.29,600 నుంచి 1,19,500 వరకు ఉంటుంది. 


Also Read: ISRO Recruitment 2021: టెన్త్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.63 వేల వరకు జీతం..


Also Read: Amazon Jobs: అమెజాన్‌ జాబ్ మేళా.. 8 వేల ఉద్యోగాలు భర్తీ.. హైదరాబాద్‌లో కూడా..