ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం సబ్‌స్క్రిప్షన్ గడువు నేటితో (సెప్టెంబర్ 3) ముగియనుంది. సావరీన్ గోల్డ్ బాండ్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడిదారులు గ్రాముకు రూ .50 ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. డీ మ్యాట్ అకౌంట్ల ద్వారా గానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన ఇతర మార్గాల ద్వారా గానీ సావరీన్ బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స్కీంలో  కనీస పెట్టుబడి ఒక గ్రాముగా ఉంది. ఇందులో చేరాలనుకునే వారు బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 


ఈ స్కీంకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. తమ బ్యాంకు నుంచే ఆన్‌లైన్ ద్వారా సావరీన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేయవచ్చని తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి. తమ ఖాతాదారులు ఈ-స‌ర్వీస్‌లో ఉన్న ఐఎన్‌బీ ఆప్ష‌న్ ద్వారా నేరుగా ఈ స్కీంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చని ఎస్‌బీఐ తెలిపింది. 


సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22.. గోల్డ్ బాండ్ ధర, రిటర్న్ వివరాలు.. 



  • సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021 ఆగస్టు 30న ప్రారంభమైంది. ఈరోజుతో ముగియనుంది. 

  • సావరిన్ గోల్డ్ బాండ్‌లలో పెట్టుబడి పెట్టడానికి గల 6 కారణాలను ఎస్‌బీఐ పేర్కొంది.

  • సావరిన్ గోల్డ్ బాండ్‌లలో పెట్టుబ‌డులు పెట్టిన వారికి ఏడాదికి రెండు సార్లు 2.50 శాతం వ‌డ్డీ దక్కుతుంది. 

  • రిడంప్షన్ మీద కాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. 

  • సావరీన్ గోల్డ్ బాండ్లను రుణాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. 

  • మనం మామూలు బంగారాన్ని కొనుగోలు చేస్తే సురక్షిత స్థలంలో భద్రపరచాల్సి ఉంటుంది. ఈ బాండ్లకు అలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇవి మ‌రింత భ‌ద్రంగా ఉంటాయి. 

  • సాధారణ బంగారం, గోల్డ్ కాయిన్లకు వర్తించే జీఎస్‌టీ.. ఈ బాండ్లకు వర్తించదు. 

  • ఇందులో కనీస పెట్టుబడి ఒక గ్రాముగా ఉంది. 

  • సావరీన్ గోల్డ్ బాండ్ల ధర ఒక గ్రాము రూ.4732గా ఉంది. 


దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎస్‌బీఐ కస్టమర్లు 1800 11 2211 నంబరును సంప్రదించవచ్చు.





 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు 1-800-180-2222 లేదా 1-800-103-2222 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చు.





Also Read: Gold-Silver Price: దిగొచ్చిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. గ్రాముకు ఎంత తగ్గిదంటే..


Also Read: EPFO New Rules: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ గురించి తెలుసా? అలా చేయకపోతే ఆ డబ్బులు హాంఫట్!