News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు
X

Green Tea: డయాబెటిక్ రోగులకు గ్రీన్ టీ మంచిదేనా? తాగడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుందా?

గ్రీన్ టీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఈ పానీయం మధుమేహులకు మేలు చేస్తుందో లేదో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

డయాబెటిక్ రోగులు ఏం తిన్నాలన్నా ముందుగా అందులో చక్కెర ఉందో లేదో తెలుసుకోవాలి, జీఐ విలువ తక్కువగా ఉండే ఆహారాన్నే తినాలి. ఏది తినాలన్నా, తాగాలన్నా చాలా షరతులు వర్తిస్తాయి వారికి. ఉదయాన లేవగానే టీ, కాఫీలు తాగకుండా తెల్లవారదు చాలా మందికి.మధుమేహులు రోగులకు అంతే. అయితే చాలా మంది ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు కలుపుకుని టీ, కాఫీలు తాగేస్తారు. కానీ వాటిని వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వీరికి మంచి ఎంపిక గ్రీన్ టీ.దీన్ని తాగడం వల్ల మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. 

గ్రీన్ టీ ఎందుకు మేలు?
గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ అనే పదార్థాలుంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా మేరకు తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి గ్రీన్ టీని వీరు రోజూ తాగడం వల్ల మేలే జరుగుతుంది. ముఖ్యంగా టీ, కాఫీ కన్నా గ్రీన్ టీ తాగడం చాలా మంచిది. ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

అతిగా తాగితే అనర్థమే
గ్రీన్ టీ మితంగా తాగితే ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజుకు మూడు కప్పులకు మించి మాత్రం తీసుకోకూడదు. అంతకుమించి తాగితే మాత్రం దుష్ప్రభావాలు తప్పవు. 

1. గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. దీన్ని అధికంగా తాగడం వల్ల శరీరానికి అవసరమైన దానికన్నా అధికంగా కెఫీన్ అందుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది.
2. గ్రీన్ టీ నుంచి అందే కెఫీన్ నిద్రకు దూరం చేస్తుంది. అధికంగా తాగితే నిద్రలేమి సమస్య బాధిస్తుంది. 
3. గ్రీన్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకు గ్రీన్ టీ అధికంగా తాగితే ఈ టానిన్లు కూడా పొట్టలో యాసిడ్లను పెంచుతాయి. మలబద్ధకం కూడా పెరిగిపోతుంది. 
4. అతిగా గ్రీన్ తాగడం అనేది శరీరంలో ఇనుము లోపించేలా చేస్తుంది. తద్వారా రక్తహీనత సమస్య మొదలవుతుంది. 
5. అధికంగా గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది కాలేయ గోడలను దెబ్బతీస్తుంది.

కాబట్టి గ్రీన్ టీ ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తీసుకోండి చాలు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

Also read: హీరో విక్రమ్‌కు ఛాతీ నొప్పి? గుండె నొప్పి - ఛాతీ నొప్పి వేరు వేరా? ఏది ఏంటో ఎలా తెలుసుకోవాలి?

Also read: మగవారు జాగ్రత్త పడాల్సిందే, పెరిగిపోతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు

Published at : 09 Jul 2022 08:58 AM (IST) Tags: Green Tea Benefits Green tea for Diabetics Green tea control Diabetes Green tea side Effects

ఇవి కూడా చూడండి

WhatsApp Deleted Messages : WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. Delete చేసిన మెసేజ్ వెంటనే చూడవచ్చు

WhatsApp Deleted Messages : WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. Delete చేసిన మెసేజ్ వెంటనే చూడవచ్చు

Fasting Benefits : గ్యాస్, అసిడిటీతో బాధపడుతున్నారా? జీర్ణ సమస్యలకు బెస్ట్ సొల్యూషన్ ఇదే

Fasting Benefits : గ్యాస్, అసిడిటీతో బాధపడుతున్నారా? జీర్ణ సమస్యలకు బెస్ట్ సొల్యూషన్ ఇదే

Heart Attacks : Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే

Heart Attacks : Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే

Mobile Recharge Plans : 100 రూపాయల లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే.. జియో, ఎయిర్​టెల్​తో పాటు మరెన్నో

Mobile Recharge Plans : 100 రూపాయల లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే.. జియో, ఎయిర్​టెల్​తో పాటు మరెన్నో

Diabetes Warning Signs : చర్మంపై కనిపించే ఈ 7 మార్పులు మధుమేహానికి సంకేతాలు.. లక్షణాలు విస్మరించవద్దంటోన్న వైద్యులు

Diabetes Warning Signs : చర్మంపై కనిపించే ఈ 7 మార్పులు మధుమేహానికి సంకేతాలు.. లక్షణాలు విస్మరించవద్దంటోన్న వైద్యులు

టాప్ స్టోరీస్

IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్

IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?

Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!

Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక,  ప్రత్యేక పూజలు!

Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..

Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..