Two Major Warning signs on your face About High cholesterol: శరీరంలో ఏవైనా మొతాదుకు మించి ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇక ఏదైనా తేడా జరిగితే వెంటనే ఏదో ఒక విధంగా, ఏదో ఒక లక్షణం బయటపడుతుంది. అలానే ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ ఉంటే ముఖంలో మార్పులు వస్తాయట. శాంథెలాస్మా, కార్నియల్ ఆర్కస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ లక్షణాలు హై కొలెస్ట్రాల్‌కు సూచన. హై కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. రక్తంలో పేరుకుపోయి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుందని అంటున్నారు.
శాంథెలాస్మా..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నాయని తెలిపే లక్షణం శాంథెలాస్మా. చర్మం కింద కొవ్వు ఎక్కువైనప్పుడు ఈ లక్షణం బయటపడుతుంది. కళ్ల చుట్టూ పసుపు బొబ్బలు కనిపించడాన్ని శాంథెలాస్మా అంటారు. కళ్ల కింద లేదా కళ్లపైన ఇలాంటి బొబ్బలు కనిపిస్తాయి. ఇవి ఒక్కోసారి ముఖం మీద మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి. ఇలాంటి బొబ్బలు కనిపిస్తే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి.
కార్నియల్ ఆర్కస్..
ఒంట్లో హై కొలెస్ట్రాల్ వున్నాయి అనేందుకు కార్నియల్ ఆర్కస్ కూడా ఒక లక్షణం. కంటిలోని గుడ్డు చుట్టూ తెల్లగా లేదా బ్లూ కలర్ పొరలాగా కనిపిస్తుంది. ఇది కనిపిస్తే హై కొలెస్ట్రాల్ రిస్క్ ఉన్నట్లు అర్థం. 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, చూపులో ఎలాంటి లోపం లేకుండా.. గుడ్డు చుట్టూ పొర కనిపిస్తే రిస్క్ లో ఉన్నట్లే లెక్క. ఇది ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరోలేమియాకి దారితీసే అవకాశం ఉంది.
ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరోలేమియా ఎలా కనుక్కోవాలంటే?
ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరోలేమియా అనేది వారసత్వంగా వస్తుందని చెప్తున్నారు యూకే కి చెందిన డాక్టర్లు. 250 మందిలో ఒకరికి ఇది వారసత్వంగా సంక్రమిస్తుందని చెప్తున్నారు. బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని కనుక్కోవచ్చని చెప్తున్నారు. రక్తంలో కొలస్ట్రాల శాతం ఎక్కువగా ఉండి.. ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉంటే.. మరిన్ని టెస్టులు చేస్తారని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడించింది. ఆ టెస్ట్ లలో పాజిటివ్ వచ్చినా లేదా డాక్టర్ మీ ముఖంలో, ఫిజికల్ గా కొన్ని మార్పులు గమనించినా స్పెషలిస్ట్ కి రెఫర్ చేస్తారు. జెనిటిక్ టెస్ట్ లు తదితర టెస్ట్ లు చేసి దాన్ని నిర్ధారిస్తారు.
ఈ లక్షణాలు ఉన్నప్పటికీ.. ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరోలేమియా టెస్ట్ చేస్తారు..
⦿ రక్త పరీక్షలో హై కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
⦿ చిన్నవయసులోనే హార్ట ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు.
⦿ ఫ్యామిలీలో ఎవరైనా చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో చనిపోతే.
⦿ ఫ్యామిలీలో ఎవరికైనా హై కొలెస్ట్రాల్ డయాగ్నైజ్ అయినప్పుడు.
⦿ ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరోలేమియా వల్ల హై కొలెస్ట్రాల్ రాదు. బరువు, హెల్త కండీషన్స్, బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ వల్ల కూడా కలుగుతాయి.
Also Read: యువతి ప్రాణం తీసిన రొయ్యలు ⦿ ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.