Prawns Negative Health Effects: కేరళలో రీసెంట్ గా విషాద ఘటన జరిగింది. రొయ్యలు తినడం వల్ల అలర్జీ ఏర్పడి 20 ఏళ్ల యువతి చనిపోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయమైంది. పాలక్కాడ్‌కు చెందిన నిఖిత రొయ్యల కూరతో భోజనం చేసింది. తిన్న కాసేపటికే ఆమెకు అలర్జీ ఏర్పడింది. తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆమె స్నేహితులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ చేసినప్పటికీ.. ప్రాణాలు కాపాడలేకపోయారు. ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయింది.
రొయ్యలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు, కానీ..
రొయ్యలు ఆరోగ్యానికి ఎంత మంచివో, అంతే ప్రమాదం అంటున్నారు నిపుణులు. రొయ్యలు తినేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు పోవడం ఖాయం అంటున్నారు. రొయ్యలు తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. నిజానికి రొయ్యలు బలవర్థకమైన ఆహారం. దీనిలోని సెలీనియం, ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. దీనిలోని విటమిన్ B12 మెదడు చురుగ్గా పని చేసేలా తోడ్పడుతుంది. చక్కటి చర్మ సౌందర్యాన్ని కలిగించడంలోనూ సాయపడుతాయి. వీటిలోని విటమిన్ C శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, రొయ్యలతో ఎన్నిలాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. అలసత్వం వహిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
రొయ్యలు ప్రాణాలు తీస్తాయి కూడా!
రొయ్యలు ప్రధానంగా చర్మం మీద దురద, అలర్జీకి కారణం అవుతాయి. అది కాస్త తీవ్రం అయితే, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ రొయ్యలు అలర్జీకి ఎలా కారణం అవుతాయంటే? రొయ్యల వీపు మీద నల్లని రక్తనాళాలు ఉంటాయి. రొయ్యలను శుభ్రం చేసేటప్పుడు వాటిని తొలగించాలి. వీటిలో అత్యంత ప్రమాదమైన విష, వ్యర్థ పదార్థాలు ఉంటాయి. వీటిని సరిగా తొలగించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. తీవ్రమైన అలర్జీ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎగ్జిమా లేదంటే అటోపిక్ డెర్మటైటిస్ అని అంటారు. చర్మంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడితే అత్యంత ప్రమాదం అని గుర్తించాలి. శరీరంపై గడ్డలు ఏర్పడి దురద తీవ్ర అవుతుంది. కళ్ళు, నోరు, చర్మం మీద దురద ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత శ్వాసకోశ సమస్యలు, ఛాతీ నొప్పి ఏర్పడుతుంది. అలసట, తలతిరగడం ఏర్పడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు రిస్క్ లో పడతాయి.
దీర్ఘకాలంలోనూ ముప్పు తప్పదు!
ఒక్కోసారి సరిగా శుభ్రం చేయని రొయ్యలు తింటే అప్పటికప్పడు ఇబ్బందులు కలగకపోవచ్చు. కానీ, పేగుల్లో ఈ వ్యర్థాలు అలాగే ఉంటాయి. టాక్సిన్స్, రసాయనాల రూపంలో ఉండిపోతాయి. ఇవి జీర్ణ వ్యవస్థతతో పాటు, పేగులను ధ్వంసం చేస్తాయి. నెమ్మదిగా చర్మం మీద దద్దుర్లు రావడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చివరకు ప్రాణాలను హరిస్తాయి.
రొయ్యలను జాగ్రత్తగా శుభ్రం చేయాలి
రొయ్యలను ఎంత చక్కగా క్లీన్ చేసే అంత మంచిది. ముందు వాటిని చల్లటి నీళ్లలో కడగాలి. తల, తోక, కాళ్లు తొలగించాలి. రొయ్యల చుట్టూ ఉన్న నల్లటి రక్తనాళాలను తీసివేయాలి. చివరగా ఉప్పు, పసుపు వేసి వాటిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత వండి తినడం మంచిది.
Read Also: హాట్ సమ్మర్లో మట్టి కుండలోని నీరు తాగుతున్నారా? అయితే మీరు వీటి గురించి తెలుసుకోవాల్సిందే