BR Ambedkar Jayanti 2024: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ సంఘసంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా అందరికీ (Ambedkar Jayanti 2024) తెలుసు. కానీ...ఆయన వ్యక్తిగత జీవితంలో మనకి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. ఆయన ఎలా ఉండే వారు..? ఏం తినేవారు అని ఆరా తీస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ఆయన ఆహారపు అలవాట్ల ( Food Habits of Ambedkar) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చాలా మంచి చెఫ్‌. చాలాసార్లు స్వయంగా వండుకుని తినేవారట. సులువుగా జీర్ణమయ్యేవి, ఆరోగ్యకరమైనవి మాత్రమే ఎక్కువగా తీసుకునే వారట. బగారా, బిర్యానీ కంటే ఎక్కువగా ప్లేన్ రైస్‌నే ఎక్కువగా ఇష్టపడే వారు అంబేడ్కర్. అందులోకి పప్పు కంపల్సరీ. అందులోనూ కందిపప్పునే ఎక్కువగా తీసుకునే వారు.


కందిపప్పుతో చేసిన దాల్‌ ఆయనకు చాలా ఇష్టమైన వంటకం కూడా. కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంత మంచి (BR Ambedkar's Favourite Dish) చేస్తాయో సన్నిహితులతో వివరించే వారట అంబేడ్కర్. తన శరీరానికి కంఫర్ట్ అనిపించేవి మాత్రమే తినేవారు. అన్ని సీజన్స్‌లోనూ ఇదే డైట్ ఫాలో అయ్యే వారు. సింపుల్‌ వెజ్‌ఫుడ్‌ తీసుకునేందుకు ఇష్టపడే అంబేడ్కర్ పెరుగు, చపాతీ మాత్రం కచ్చితంగా ఉండేలా చూసుకునే వారు. పెరుగు, చపాతీ అంటే ఆయనకు చాలా ఇష్టమట. వీటితో పాటు టీ, పాపడ్, బిస్కట్స్ ఎక్కువగా తీసుకునే వారు అంబేడ్కర్. చాలా లైట్‌ ఫుడ్ తీసుకునే ఆయన సన్నిహితులందరికీ ఇదే డైట్ ఫాలో అవమని సలహా ఇచ్చేవారు. అలా అయితేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేవారు. 


సీ ఫుడ్ అంటే ఇష్టం..


వెజ్ అంటే ఎంతో ఇష్టపడిన అంబేడ్కర్ సీ ఫుడ్ అన్నా అంతే మనసు పారేసుకునే వారు. ఎప్పుడైనా మీటింగ్స్ మధ్యలో కాస్తంత ఖాళీ దొరికితే వెంటనే గరిటె తిప్పేవారు. స్వయంగా ఫిష్ కర్రీ చేసుకుని తినేవారు. అందులో కొబ్బరి ఎక్కువగా వేసుకునే వారట. ఈ కొంకణ్ రెసిపీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇలా చేస్తే రుచి ఇంకాస్త పెరుగుతుందని సన్నిహితులతో చెప్పేవారు. అంతే కాదు. ఇలా వండి వాళ్లందరికీ రుచి చూపించే వారు. వీటితో పాటు Bombil Chutney అన్నా తెగ ఇష్టపడే వారు. దీన్నే  Bombay Duck గానూ పిలుస్తారు. ఆయన స్వయంగా తయారు చేసుకుని మరీ తినే వారు. కూరల్లో, పచ్చళ్లలో వేసుకోవడంతో పాటు ఒక్కోసారి దీన్నే పచ్చడిగానూ తీసుకునే వారు.



రోటీ, పెరుగు, కాస్తంత రైస్, ఫిష్ కర్రీ ఉంటే ఆ పూటకు అదే పంచభక్ష్య పరమాన్నాలుగా భావించే వారట. ఆయనకు బజ్జీలు అన్నా తెగ ఇష్టం. చిన్నతనంలో ఉదయం వాటిని కొనుక్కుని సాయంత్రం వరకూ దాచుకుని రాత్రిపూట పడుకునే ముందు తినేవారు. ఇక యూకేలో ఉన్నప్పుడు అంబేడ్కర్ Bovril కూడా ఎక్కువగా తీసుకునే వారు. బీఫ్ నుంచి తయారు చేసిన ఈ బోవ్రిల్‌ని టోస్ట్‌లు, బిస్కట్‌లపై అద్దుకుని తీసుకునే వారు. నెయ్యి, జామ్స్‌తో పాటు చికెన్, మటన్, ఎగ్స్‌ అప్పుడప్పుడూ తినే వారు. ముల్లంగి అన్నా ఆయనకు చాలా ఇష్టమట. 


Also Read: Ambedkar Jayanti 2024: ఉద్యోగుల పని గంటల్ని తగ్గించింది అంబేడ్కర్ అని మీకు తెలుసా, ఇన్సూరెన్స్ కూడా ఆయన వల్లే