శరీరంలోని ప్రతి అవయవం ఏదో ఒక దశలో అలసిపోతుంది. ఆ అలసట తాలూకు సంకేతాలు మనకు తెలుస్తూనే ఉంటాయి.  కానీ వాటిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కొత్త అధ్యయనం ప్రకారం 65 ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రం అది తేలికగా తీసుకునే విషయం కాదు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ఈ కొత్త పరిశోధన తాలూకు వివరాలను ప్రచురించారు.


అరవై అయిదేళ్లు నిండిన వారు తమ రోజు వారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వాటిని వయసు పెరగడంతో వచ్చిన సమస్యలుగా కొట్టిపడేస్తారు. నిజానికి వారు రోజూ చేసే పనులు అంటే నడక, దుస్తులు మార్చుకోవడం, దుకాణాలకు వెళ్లి సరుకులు కొనడం, వంట చేయడం వంటి పనులు కూడా చేయలేకపోవడం, అతి త్వరగా అలసి పోవడం వంటివి వారికి ముందస్తు మరణ హెచ్చరికలుగా పేర్కొంది తాజా పరిశోధన. 


ALSO READ:మీ కారే.. మీ రెస్టరెంట్.. కరోనా నేపథ్యంలో మెట్రో నగరాల్లో పెరుగుతున్న న్యూ కల్చర్‌


అరవై అయిదేళ్లు పైబడిన వారిలో చాలా మంది కుర్చీలోంచి వెంటనే లేవలేరు. అలాగే చాలా మందికి చేతి గ్రిప్ కూడా తగ్గుతుంది. వస్తువులను గట్టిగా పట్టుకోలేరు. నడకలో వేగం కూడా మందగిస్తుంది. ఇవన్నీ కూడా పదేళ్ల ముందు కనిపించే మరణ సంకేతాలుగా పేర్కొన్నారు పరిశోధకులు. 


ముప్పై ఏళ్లకు పైగా జరిగిన ఈ అధ్యయనంలో దాదాపు 6000 మందిపై పరిశోధన చేశారు. 1985 నుంచి 1988 మధ్య 33 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసున్న వారిని ఎంపిక చేసి వారిపై ఈ పరిశోధన చేశారు. అప్పటి వారి నడక,  రోజు వారీ పనులు, వాటి వేగం, శక్తి ... అన్నింటినీ అంచనా వేశారు. తరువాత 2007 నుంచి 2016 మధ్య మళ్లీ వారిపై పరిశోధనలు చేశారు.  వారి నడక వేగం, ఇతర పనుల్లోని వేగం, ఉపయోగించిన శక్తి... వంటి అంశాలను మళ్లీ రికార్డు చేశారు. 


ALSO READ: అతి వ్యాయామం.. అకస్మాత్తుగా మరణం, కెమెరాకు చిక్కిన ఘటన.. అతడికి ఏమైంది?


అంతేకాదు  2019 అక్టోబర్ వరకు వారిలో ఎంత మంది మరణించారో లెక్కగట్టారు. ఈ మొత్తం డేటాని పరిశోధించాక వారు ఒక అంచనాకు వచ్చారు. దాని ప్రకారం మరణించినవారిలో,  వారు చనిపోవడానికి  కొన్నేళ్ల ముందు నుంచే వారి రోజు వారీ కార్యక్రమాలలో శారీరక శ్రమ మందగించడం గమనించారు. పదేళ్ల ముందే వారు కుర్చీలోనుంచి లేవడానికి కూడా కష్టపడినట్టు గుర్తించారు. అలాగే నడక వేగం మందగించింది.  దీన్ని బట్టి మరణానికి కొన్నేళ్ల ముందు నుంచే శారీరక శ్రమ తగ్గుతుందని గుర్తించారు. ఇలా శారీరక శ్రమ తగ్గడం మరణ సంకేతమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. 


ALSO READ:వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..


ALSO READ: సింగర్ మొగులయ్యకు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం