టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఇందులో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడటం ద్వారా కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్ మొగులయ్యకు ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. 


తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన శ్రీ మొగులయ్య గారు 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారు. త్వరలోనే మొగులయ్యకు చెక్కును పవన్ కల్యాణ్ అందించనున్నారని జనసేన పార్టీ తెలిపింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


Also Read: భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ సింగర్ మొగులయ్య గురించి తెలుసా ?






దర్శనం మొగులయ్య స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురావిపాకుల గ్రామం. పండుగల సాయన్న, పానుగంటి మియ్యసావు, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్ వంటి వారి వీరగాథలు చెప్పడంలో ఈయన సిద్దహస్తుడు. జానపద కళనే నమ్ముకొని తన గేయాలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో దర్శక నిర్మాతలు పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ టైటిల్‌ సాంగ్‌ను మొగులయ్యతో పాడించారు. ఈ పాటతో మొగులయ్య కళకు తగిన గుర్తింపు లభించింది. 


‘ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్లా గుట్టాకాడ‌.. అలుగూ వాగు తాండాలోన బెమ్మాజెముడు చెట్టున్నాది.. బెమ్మజెముడూ చెట్టూకింద అమ్మా నెప్పులు ప‌డ‌త‌న్నాది.. ఎండాలేదు రేతిరిగాదు.. ఏగూసుక్కా పొడ‌వంగానే పుట్టిండాడు పులిపిల్ల.. పుట్టిండాడు పులిపిల్ల’ అంటూ సాగే భీమ్లా నాయక్ పాటను దర్శనం మొగులయ్య అద్భుతంగా పాడారు.


Also Read: Roja : సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు


‘తెలంగాణలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ కల్యాణ్‌లో ఉంది. సింగర్ మొగులయ్యకు పవన్ కల్యాణ్ లెర్నింగ్ ఫర్ హ్యుమన్ ఎక్సిలెన్స్ ద్వానా రూ.2 లక్షలు అందించాలని పవన్ కల్యాన్ నిర్ణయించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును సింగర్ మొగులయ్యకు పవన్ కల్యాణ్ అందజేస్తారని’ జనసేన రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.