దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 వేల కంటే తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదుకాగా 624 మంది మరణించారు. తాజాగా 7,678 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.







  • మొత్తం కేసులు: 34,674,744

  • మొత్తం మరణాలు: 4,74,735

  • యాక్టివ్​ కేసులు: 94,943

  • మొత్తం కోలుకున్నవారు: 3,41,05,066







దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. గురువారం ఒక్కరోజే 74,57,970 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,31,18,87,257కు చేరినట్లు కేంద్ర ఆరోగ్ శాఖ వెల్లడించింది.


ఒమిక్రాన్ కేసులు..


భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్  కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.  


ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలను తప్పక పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువైతే మరో వేవ్ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించాయి.


Also Read: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?


Also Read: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం


Also Read: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు


Also Read: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు


Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి