మెడపై చిన్న కురుపు వచ్చిందని చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లే ప్రాణాలు పోయిన ఘటన వెలుగు చూసింది. అది పూడ్చి పెట్టిన తర్వాత.. బయటికి తీసి మరీ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని బాధితులు వాపోయారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ.. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిని షేక్‌ అబ్దుల్‌ రహీం లక్డీకపూల్‌లో మిరాకిల్‌ గ్లాస్‌ ట్రేడర్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2న సాయంత్రం తన వీపుపై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్‌ కొడుకు షేక్‌ జునేద్‌ అనే 21 ఏళ్ల వ్యక్తి తన తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌ జునేద్‌ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్‌ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్‌ సజ్జాద్‌ షేక్‌ జునైద్‌కు పరీక్షలు నిర్వహించి క్లినిక్‌లోకి తీసుకువెళ్లి అడగకుండానే మైనర్‌ సర్జరీ చేసి కురుపును తొలగించాడు.


సర్జరీ విషయం తెలిసిన జునైద్‌ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని అడిగాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్‌ జునేద్‌కు నొప్పి బాగా పెరిగింది. రక్తస్రావం కూడా జరిగింది. ఇది గమనించిన డాక్టర్‌ సజ్జద్‌ షేక్‌ జునైద్‌ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్‌ జునేద్‌కు ఆపరేషన్‌ చేయాలంటూ డాక్టర్లు నేరుగా ఆపరేషన్‌ థియేటర్‌కి తీసుకెళ్లారు.


ఆ కురుపు వద్ద మైనర్‌ సర్జరీ చేసే సమయంలో సూది జునైద్‌ శరీరంలోనే ఉండిపోయిందని, 3న ఉదయం షేక్‌ జునైద్‌ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ఆపిల్‌ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా ఆపరేషన్ చేశారని షేక్‌ అబ్దుల్‌ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోల్కొండ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.


బాధితుడి విజ్ఞప్తి మేరకు గురువారం చనిపోయి కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద ఖననం చేసిన యువకుడిని ఉస్మానియా వైద్యులు బయటికి తీశారు.  అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక రావాల్సి ఉంది.


Also Read: Nellore: నెల్లూరులో యువకుడు దారుణ హత్య... పక్కనే యువతి ఫొటోలు... ప్రేమ వ్యవహారమే కారణమా..?


Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


Also Read: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్


Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి