నెల్లూరులో దారుణ హత్య జరిగింది. నగరంలోని మన్సూర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అల్తాఫ్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి కాలువ గట్టున పడేసి వెళ్లారు. ఆ పక్కనే అతని బైక్ ఉంది. అక్కడే ఓ అమ్మాయితో దిగిన ఫొటోలు, సెల్ ఫోన్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాయి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Also Read:చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి.. 


ఇంటర్ విద్యార్థి కిడ్నాప్


ప్రకాశం జిల్లా ఇంటర్‌ విద్యార్థి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. ఈ కిడ్నాప్ పై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా  మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామానికి చెందిన షేక్‌ మున్నా, నాసర్‌బీ దంపతుల కుమారుడు నాసర్‌వలీ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఇంటికి రాలేదు. స్నేహితుల వద్దకు వెళ్లి ఉంటాడని భావించారు. కానీ బుధవారం కూడా ఇంటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు మార్కాపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాసర్‌వలీ స్నేహితులను విచారించారు. ఇంతలో నాసర్ ను కిడ్నాప్ చేశామని, రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఓ మెసేజ్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఇడుపూరు గ్రామానికి చేరుకోని విచారణ చేపట్టారు. విద్యార్థి స్నేహితులతో పాటు గ్రామస్తులను విచారించారు. 


Also Read: బెజవాడలో చెలరేగిపోతున్న చెడ్డీ గ్యాంగ్... వరుస దోపీడీలతో పోలీసులకు సవాల్


Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


Also Read: ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు... మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతారు.... మంత్రి బొత్స ఫైర్


Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి